ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్చిచ్చు..!

ABN, First Publish Date - 2022-07-21T06:24:36+05:30

కార్చిచ్చు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశినేని బ్రదర్స్‌ వార్‌

మరోసారి వివాదాల సుడిలోకి ఎంపీ కేశినేని నాని

కారుపై నకిలీ ఎంపీ స్టిక్కర్‌ వాడారని..

సేవా కార్యక్రమాలతో వెలుగులోకి వస్తున్న కేశినేని చిన్ని

మద్దతు పలుకుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

వ్యక్తిగత వ్యవహారానికి రాజకీయ రంగులు


‘స్వపక్షంలో విపక్షం’.. విజయవాడ ఎంపీ కేశినేని నానీకి టీడీపీ శ్రేణులు ముద్దుగా పెట్టుకున్న పేరు ఇది. ముక్కుసూటిగా మాట్లాడుతున్నాననే ఉద్దేశంతో తరచూ టీడీపీ అధినేతకు, శ్రేణులకు చిక్కులు తెచ్చిపెట్టడం నానీకి షరామామూలే. తాజాగా కేశినేని బ్రదర్స్‌ నడుమ నడుస్తున్న ఈ కారు స్టిక్కర్‌ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య వార్‌ ముదిరిపాకాన పడింది. కొద్దిరోజులుగా విజయవాడ కేంద్రంగా చిన్ని వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడంతో ఈ కార్యక్రమాలకు రాజకీయ రంగు పులిమారు. అదే సమయంలో గతంలో కేశినేని నానీకి సన్నిహితంగా ఉన్న పలువురు టీడీపీ నాయకులు శివనాథ్‌కు దగ్గరవుతూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ కేశినేని బ్రదర్స్‌ నడుమ దూరాన్ని పెంచాయి. అయితే, తన సోదరుడు నానీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం అనే లక్ష్యాలతో తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని శివనాథ్‌ ప్రకటించారు. నాని మాత్రం తన సోదరుడితో తనకు దూరం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు శివనాథ్‌ను ఉద్దేశించి ‘నా శత్రువును మీరు ప్రోత్సహిస్తే, మీ శత్రువును నేను ప్రోత్సహిస్తా..’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసినవని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

ఆది నుంచీ అదే వైఖరి

2019 ఎన్నికల నుంచి నాని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెడుతూ వస్తున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి మూడు ఎంపీ స్థానాలు దక్కాయి. విజయవాడ నుంచి ఎంపీగా నాని గెలుపొందారు. ఈ గెలుపు తన ఒక్కడి కారణంగానే తప్ప పార్టీ అండతో కాదన్న అభిప్రాయంలో ఆయన ఉండిపోయారు. దీంతో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల టీడీపీ నాయకులతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గ నాయకులతో నానీకి దూరం పెరుగుతూ వచ్చింది. అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నెట్టెం రఘురామ్‌ను 2020లో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారంటే కేవలం నాని మాటకు విలువ ఇచ్చే. మంత్రి పదవి పొందిన కొడాలి నాని జీవితాంతం దేవినేని ఉమాకు రుణపడి ఉండాలని అప్పట్లో నాని ట్వీట్‌ చేయడం గమనార్హం. పార్లమెంటులో టీడీపీపక్ష నేత, విప్‌ పదవుల విషయంలో కూడా చంద్రబాబుపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి జరిగిన సందర్భాల్లో స్పందించలేదు. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో విజయవాడలో ఉండి కూడా రాలేదు. ఒంగోలులో జరిగిన మహానాడుకు ఎంపీ నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత హాజరుకాలేదు. జూలై 9న నందిగామ నియోజకవర్గం పరిటాలలో జరిగిన 35 నియోజకవర్గాల రైతుపోరు సభకు సైతం రాలేదు. మొత్తం మీద తరచూ తన మార్కు వ్యవహారశైలితో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా నిలుస్తున్నారు. 

కారుపై స్టిక్కర్‌ వివాదం

తాజాగా ఎంపీ కేశినేని నాని తన తమ్ముడిని టార్గెట్‌ చేస్తూ హైదరాబాద్‌, విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. తన పేరుతో ఉన్న నకిలీ ఎంపీ స్టిక్కర్‌ను అంటించుకుని టీఎస్‌07 హెచ్‌డబ్ల్యూ 7777 అనే కారు తిరుగుతోందని విజయవాడ, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్లకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. నాని పేర్కొన్న వాహనం ఆయన సోదరుడు శివనాథ్‌ సతీమణి పేరుతో ఉండటం గమనార్హం. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పోలీసులు ఈ కారును ఆపి తనిఖీలు చేయడంతో ఈ ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. తనకు పోటీగా విజయవాడలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే అక్కసుతోనే నాని ఫిర్యాదు చేశారని శివనాథ్‌ అనుచరులు భావిస్తున్నారు. 


చిల్లర వివాదంలోకి ఆడవాళ్లా..? : కేశినేని చిన్ని

‘చిల్లర వివాదంలోకి ఇంట్లో ఆడవాళ్లను లాగడం బాధాకరం. నా కారుకు ఉన్న ఎంపీ స్టిక్కర్‌ ఎవరిదో, ఏంటో విచారణలో తేలుతుంది. హైదరాబాద్‌లో పోలీసులు నా వాహనాన్ని ఆపారు. పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు తీసుకెళ్లారు. విచారణ చేశారు. క్లీన్‌చిట్‌ ఇచ్చారు. టీడీపీలో నేను ఓ చిన్న కార్యకర్తను. చంద్రబాబు సీఎం కావడమే నా లక్ష్యం. ఆటోనగర్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవం జరపాలని భావించాను. కానీ, దాన్ని వివాదాల్లోకి లాగారు. నాని నా శత్రువు కాదు. నా అన్నయ్య. నేను ఎంపీగా పోటీ చేస్తానని, నాకు టికెట్‌ ఇవ్వాలని ఎప్పుడూ, ఎవరినీ అడగలేదు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి సిద్ధం. నేను విజయవాడలో వ్యాపారవేత్తలెవరినీ బెదిరించలేదు. నేను ఏ తప్పు చేసినా బయటకు వచ్చేది. ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్‌ లేదు. నాపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహారమే కానీ, రాజకీయపరమైనది కాదు. దీంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నాపై రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కానీ, చిల్లర వివాదాల్లోకి ఇంట్లో ఆడవాళ్లను లాగడమే బాధాకరం. పార్టీ ఆదేశిస్తే దేనికైనా రెడీ. నాని గెలుపు కోసం పనిచేయడానికైనా సిద్ధమే.’ అని కేశినేని చిన్ని ప్రకటించారు. 

Updated Date - 2022-07-21T06:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising