ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 13, 14, 15 తేదీల్లో బ్రదర్‌ జోసఫ్‌ తంబి తిరునాళ్ల

ABN, First Publish Date - 2022-12-15T01:01:44+05:30

కరోనా విపత్కర పరిస్థితులు తొలగిపోయిన నేపధ్యంలో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, పెదఅవుటపల్లిలోని బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రంలో జనవరి 13, 14, 15తేదీల్లో దైవసేవకుడు తంబి 78వ వర్ధంతి మహోత్సవాలను(తిరునాళ్లు)ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తంబి పుణ్యక్షేత్రం రెక్టర్‌, రెవరెండ్‌ ఫాదర్‌ నన్నం సుధాకర్‌ లారెన్స్‌ అన్నారు.

ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న తంబి పుణ్యక్షేత్రం రెక్టర్‌ రెవ.ఫా.సుధాకర్‌లారెన్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, డిసెంబరు 14 : కరోనా విపత్కర పరిస్థితులు తొలగిపోయిన నేపధ్యంలో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, పెదఅవుటపల్లిలోని బ్రదర్‌ జోసఫ్‌ తంబి పుణ్యక్షేత్రంలో జనవరి 13, 14, 15తేదీల్లో దైవసేవకుడు తంబి 78వ వర్ధంతి మహోత్సవాలను(తిరునాళ్లు)ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తంబి పుణ్యక్షేత్రం రెక్టర్‌, రెవరెండ్‌ ఫాదర్‌ నన్నం సుధాకర్‌ లారెన్స్‌ అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్‌, ఫైర్‌, విద్యుత్‌, ఆరోగ్య, పంచాయతీ తదితర శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఫాదర్‌ మాట్లాడుతూ జనవరి 4నుంచి 12వరకు నవదిన ప్రార్ధనలు జరుగుతాయని, ఉత్సవాల మూడురోజులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలనుంచేకాక, దేశంలోని వివిధప్రాంతాలనుంచి పెద్దఎత్తున యాత్రికులు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, క్యాలెండర్లను ఫాదర్‌ సుధాకర్‌ లారెన్స్‌, అధికారులు, సంఘపెద్దలు ఆవిష్కరించారు. గన్నవరం ఫైర్‌ ఆఫీసర్‌ జాన్‌ అహ్మద్‌, పెదఅవుటపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ షేక్‌ కరీముల్లా, ఎంపీహెచ్‌ఈవో పి.శ్రీనివాసరావు, పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి జి.అప్పారావు, సంఘపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising