ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్ల నిర్మాణానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-05-22T06:09:48+05:30

బోర్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఈడుపుగల్లులో బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్‌ ఇందిర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈడుపుగల్లు (కంకిపాడు), మే 21 : గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈడుపుగల్లు సర్పంచ్‌ పి. ఇందిర అన్నారు. గ్రామంలో రూ. 2.50 లక్షలతో బోరు నిర్మాణానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వేసవిలో తాగు నీటి సమస్యతో గ్రామస్థులు ఇబ్బంది పడకుండా అన్నిచర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా మురుగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యగా డ్రెయినేజీ పనులు చేపట్టామని, ప్రాధాన్యతా క్రమంలో రోడ్లు, డ్రెయినేజీ నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కిలారు శ్రీనివాసరావు, ఈవో భారతి పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నిధులు కేటాయించడం జరుగుతుందని ఎంపీపీ యరగొర్ల నగేష్‌ తెలిపారు. ఓగిరాలలో తాగునీటి అవసరాల కోసం బోరు నిర్మాణానికి శనివారం జడ్పీటీసీ గంగాభవాని, సర్పంచ్‌ కగ్గా పద్మావతితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. బోరు వేసేందుకు అవసరమైన రూ. 8లక్షలను ఎంపీపీ గ్రాంటు నుంచి మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్‌ నక్కా గాంధీ, ఎంపీటీసీ సభ్యుడు తోకల సుబ్బారావు, కార్యదర్శి దీప్తి, ఆర్‌డబ్యూఎస్‌ అధికారి సరిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising