ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర నిధులతో ఓట్లు.. ప్రజలపై పన్నుల భారం

ABN, First Publish Date - 2022-08-04T06:45:21+05:30

రాష్ట్ర ప్రజలపై దారుణంగా పన్నులు వేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన పథకాలకు ఉపయోగించుకుని పరోక్షంగా ఓట్లు కొనుక్కుంటున్నాడని సీఎం జగన్‌పై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అమరావతి రాజధాని బీజేపీ ఎజెండా

- యువ సంఘర్షణ యాత్రలో జగన్‌పై కన్నాలక్ష్మీనారాయణ ధ్వజం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 3 : రాష్ట్ర ప్రజలపై దారుణంగా పన్నులు వేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన పథకాలకు ఉపయోగించుకుని పరోక్షంగా ఓట్లు కొనుక్కుంటున్నాడని సీఎం జగన్‌పై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ యాత్రను బుధవారం కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో గాంధీ మహాత్ముని విగ్రహం, కోపల్లె హనుమంతరావు విగ్రహానికి కన్నా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రజలు పన్నులభారం తో ఆర్థికంగా కృంగిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్‌ ఇంజన్‌ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రం ఇచ్చే 130 సంక్షేమ పథకాలను రాష్ట్రానికి పంపుతుంటే ఈ పథకాలను రాష్ట్రం తమ పథకాలుగా చెప్పుకుంటోందన్నారు. రాష్ట్రాభివృద్ధి కేంద్రం ఇచ్చే వేలాది కోట్ల నిధులతోనే జరుగుతోందన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ ముమ్మాటికి కోరుకుంటోందన్నారు. అమరావతి రాజధాని కాదంటే వైసీపీకి పుట్టగతులుండవన్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలియజేసేందుకే భారతీయ యువజన మోర్చనాలుగు ప్రాంతాల నుంచి యాత్ర చేపట్టిందన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేసినేని సురేంద్రమోహన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గోపిశెట్టి దుర్గాప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతి, మైనార్టీ మోర్చ నాయకులు షేక్‌ బాజీ, జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజాతీయ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కోనేరుసెంటర్‌, జడ్పీసెంటర్‌ మీదుగా పెడనకు వెళ్లింది. 

Updated Date - 2022-08-04T06:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising