ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

*గట్టు*దిట్టమయ్యేనా!

ABN, First Publish Date - 2022-05-26T06:43:28+05:30

జిల్లాలో సాగునీటి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువగట్లు దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  జిల్లాలో కాలువ గట్లు శిథిలం 

  తూటుకాడ, గుర్రపు డెక్కలతో ఉన్న పంట కాలువలు 

  నత్తనడకన మరమ్మతులు, తవ్వకాలు

  కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌

  10 లోగా పనులు పూర్తయితేనే చివరి భూములకు నీరందేది

 మూడు శాఖల మధ్య సమన్వయం అవశ్యం

మచిలీపట్నం టౌన్‌, మే 25 : జిల్లాలో సాగునీటి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువగట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిపోయాయి. ఇంకొన్నిచోట్ల పూడికతీత పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనుల్లో తాత్సారం నెలకొంది. ఒకవైపు జూన్‌ 10వ తేదీ నాటికి సాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతూ మరోవైపు కాలువలను పటిష్టపరిచే పనుల్లో జాప్యం చేయడం వల్ల చివరి భూములకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.  

 7 లక్షల 20 వేల ఎకరాల ఆయకట్టు

జిల్లాలో బందరు, రైవస్‌, ఏలూరు, కేఈబీ కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. మొత్తం 7 లక్షల 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి. ఈ ఖరీఫ్‌లో వరి నాలుగు లక్షల 37 వేల 500 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. కృష్ణా జిల్లాలోని పెడన, బందరు, చల్లపల్లి, విజయవాడ రూరల్‌, పమిడిముక్కల, పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పామర్రు, మొవ్వ, ఘంటసాల, గూడూరు మండలాల్లో లక్షా 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైవస్‌ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యం ఉన్నప్పటికీ కాలువ గట్లు సరిగా లేవు. కేఈబీ చానల్‌లో లక్షా 30 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఖరీఫ్‌ సాగు సంపూర్ణమయ్యేలా లేదు. 

  శాఖల మధ్య సమన్వయం ఉంటేనే..

 సాగుకు ఇరిగేషన్‌, వ్యవసాయం, రెవెన్యూ శాఖల అధికారుల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తేసే చివరి భూములకు సాగునీరు అందుతుంది. ఇటీవల డ్వామా ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో కాలువల తవ్వకాలు జరిగా యి. చిన్నచిన్న బోదెలు తవ్వుతున్నప్పటికీ మేజర్‌ కాలు వల తవ్వకాలు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సకాలంలో నాట్లు పడితే నవంబరు మొదటి వారంలో వరి కోతలకు వీలుంటుంది. ఇటీవల ఇరిగేషన్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా సాగునీటి విడుదలపై సమీక్షించారు. ఆ తరువాత క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా కాలువల పనులు జరగడం లేదు. అధికారుల మధ్య సమన్వయం పెంచాలి.

Updated Date - 2022-05-26T06:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising