విరమణ తొలిరోజే వివాదం
ABN, First Publish Date - 2022-12-16T01:26:39+05:30
దుర్గగుడిలో భవానీదీక్షల విరమణ తొలిరోజే పోలీసులు తమదైన రీతిలో విధులు నిర్వహించి వివాదాస్పదులుగా మారారు.
వన్‌టౌన్, డిసెంబరు 15 : దుర్గగుడిలో భవానీదీక్షల విరమణ తొలిరోజే పోలీసులు తమదైన రీతిలో విధులు నిర్వహించి వివాదాస్పదులుగా మారారు. ఉ దయాన్నే అ ర్చకుడు కోట ప్రసాద్‌ను కనకదుర్గనగర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. తన గుర్తింపుకార్డును చూపించినా పట్టించుకోలేదు. దీంతో వివాదం నెలకొంది. దేవస్థానం నుంచి సీపీకి ఫోన్ చేయడంతో ఆ యన స్పందించి కోట ప్రసాద్‌ను అనుమతించారు. పోలీసులు తమ హవాను దసరా ఉత్సవాల్లో చూపించడం పరిపాటే. భవానీదీక్షల సమయంలోవీఐపీల రాకపోకలు గానీ, ఇతరత్రా దర్శనాలకు గానీ పోటీపడడం ఉండదు. కానీ పోలీసులు అర్చకులను, ఉద్యోగులను అడ్డుకోవడం, భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
భవానీ దీక్షలు విరమించే భక్తులకు భోజనాలు పె ట్టాలని సాక్షాత్తు దేవదాయశాఖ మంత్రి ఆదేశించినా అధికారులు ఏర్పాట్లు చేయలేదు. మఽధ్యాహ్నం సమయంలో భోజనాలకు షెడ్డు అంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు దసరా ఉత్సవాల్లో మాదిరే భక్తులకు భోజనాలు పెట్టవద్దంటూ పోలీసు లు హకుం జారీ చేసినట్టు తెలుస్తోంది.
నడిచే మార్గంలోనే హోమగుండం
భక్తులు నడిచే మార్గంలోనే హోమగుండం ఏర్పా టు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. శివాల యం మెట్ల దిగువన భక్తుల నడకకు ఇబ్బందికరం గా హోమగుండం ఏర్పాటు చేశారు. ప్రణాళిక లే కుండా హడావుడిగా చేసినట్టు తెలుస్తోంది.
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా..
ఇరుముడులు సమర్పించే భక్తులు నెయ్యి నింపిన టెంకాయలను హోమగుండంలో వేస్తారు. అయితే కొ బ్బరిచిప్పలు పోగు చేసుకునే కాంట్రాక్టర్‌కు చెందిన వ్యక్తులు వాటిని అగ్నిలో ఆహుతి కాకుండానే బయటకు తీసేస్తున్నారు. హోమగుండాల లోపలికి ఎక్కిది గుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో కమలాపురం ఎమ్మెల్యే
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి గురువారం దర్శించుకున్నారు దర్శనానంతరం ఆయనకు అధికారులు ప్రసాదం, శేషవస్త్రం అందజేయగా వేద పండితులు ఆశీస్సులు అందజేశారు.
Updated Date - 2022-12-16T01:26:41+05:30 IST