ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షమించు బాపు..

ABN, First Publish Date - 2022-10-03T05:59:14+05:30

క్షమించు బాపు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, అక్టోబరు 2 : స్వాతంత్య్రం కోసం, జాతి శ్రేయస్సు కోసం అహింసే మార్గంగా ఉద్యమించిన మహాత్మాగాంధీ కన్న కలలు ఇవేనా? ఆయన్ను అనుసరించి సన్మార్గంలో నడుచుకోవడం అంటే ఇదేనా? జాతిపిత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ప్రభుత్వాలకు ఈ పేదల బతుకులు కనిపించవా? మహాత్ముడే బతికుంటే ఈ పరిస్థితిని హర్షిస్తాడా? ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివస్తున్నారని తెలుసుకున్న చిన్నారులు స్థానిక రథం సెంటర్‌, ప్రసాదాల కౌంటర్‌, దుర్గాఘాట్‌, వినాయకుడి గుడి, మెయిన్‌ రోడ్లపై ఆదివారం ఇలా గాంధీజీ వేషధారణలో భిక్షాటన చేశారు. తరాలు మారినా, తమ తలరాతలు మారలేదని, ప్రభుత్వాలు, పాలకులు మారినా చితికిన తమ బతుకులు బాగుపడలేదని మౌనంగానే భిక్షను అర్థించారు. అహింసతో స్వాతంత్ర్యాన్ని తెచ్చిన ఓ బాపూ.. నీ రూపంతో జరుగుతున్న ఈ వ్యాపారాన్ని ఇకనైనా ఆపు..



Updated Date - 2022-10-03T05:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising