ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ దొంగలెక్కలను ప్రజలు గ్రహించాలి

ABN, First Publish Date - 2022-06-30T06:03:15+05:30

గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు సంక్షేమం అందిస్తూ, వారు సంపాదించుకునే సదుపాయం కల్పించగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజల నుంచి దొరికినంత కాజేస్తున్నారని కాజేయడం పేటెంట్‌ హక్కుగా ముఖ్య మంత్రి జగన్‌ భావిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ విమర్శించారు.

ఏపీఐఐసీ కాలనీలో బాదుడే బాదుడులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ దొంగలెక్కలను ప్రజలు గ్రహించాలి

ఎమ్మెల్యే  గద్దె రామ్మోహన్‌

భారతీనగర్‌, జూన్‌ 29:  గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు సంక్షేమం అందిస్తూ,  వారు సంపాదించుకునే  సదుపాయం కల్పించగా  ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజల నుంచి దొరికినంత కాజేస్తున్నారని కాజేయడం పేటెంట్‌ హక్కుగా  ముఖ్య మంత్రి జగన్‌ భావిస్తున్నారని  ఎమ్మెల్యే  గద్దె రామ్మెహన్‌ విమర్శించారు. 4వ డివిజన్‌లోని ఏపీఐఐసీ కాలనీలో బుధవారం బాదుడే బాదుడు  కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  గద్దె  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఇటీవల తూముల భాస్కరరావు చనిపోగా ఆయన కుటుంబ సభ్యులకు రూ. ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని గద్దె అందజేశారు.  ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సిగ్గు పడేలా ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం తీరుందన్నారు. బడ్జెట్‌లో పెట్టిన రూ.66 వేల కోట్లు కనబడటంలేదని కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ కాగ్‌ తన నివేదికలో చెప్పిందన్నారు. జగన్‌ ఏ విధంగా దొంగ లెక్కలు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు. డివిజన్‌  కార్పొరేటర్లు  జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ,    డివిజన్‌ పార్టీ ఆధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరావు, బత్తుల దుర్గారావు, కోడూరు ఆంజనేయులు, అబ్దుల్‌ రషీద్‌, కర్రి ఉమామహేశ్వరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising