చర్మ సంరక్షణపై అవగాహన అవసరం
ABN, First Publish Date - 2022-01-09T06:24:33+05:30
చర్మ సంరక్ష ణపై ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరమని, ఈ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ అత్యంత అవసరమని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ కె.అనురాధ పేర్కొన్నారు.
చర్మ సంరక్షణపై అవగాహన అవసరం
చర్మవ్యాధుల నిపుణురాలు కె. అనురాధ
రామలింగేశ్వరనగర్, జనవరి 8 : చర్మ సంరక్ష ణపై ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరమని, ఈ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ అత్యంత అవసరమని ప్రముఖ చర్మవ్యాధుల నిపుణులు డాక్టర్ కె.అనురాధ పేర్కొన్నారు. వాస్యవ నర్సింగ్‌హోమ్‌లో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ‘చర్మ సంరక్షణ’ అనే అంశంపై ఆమె ప్రసంగించారు. చర్మసంరక్షణలో స్నానం చాలా ప్రాధాన్యమైనదన్నారు. స్నానానికి 5-10 నిమిషాలు కేటాయించాలని, ఎక్కువ సమయం కేటాయించినట్లైతే చర్మంపై ఉండే రక్షణ పొర డ్యామేజీ అవుతుందన్నారు. స్నానాంతరం తడిగుడ్డతో అద్దుకోవాలని, ఒళ్లంతంటికి మాయిశ్చరైజింగ్ లోషన్ రాయాలని తెలిపారు. శీతాకాలంలో మెత్తని ఊలు వస్ర్తాలు ధరించాలని, తలస్నానం వారానికి రెండుసార్లు చేయాలన్నారు. చర్మ సంరక్షణ విషయంలో మంచినీళ్లు ఎక్కువగా తాగడం, పళ్లు తినడం, నట్స్ తీసుకోవడం మంచిదని సూచించారు. చర్మసంబంఽధిత సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలని అనురాధ తెలిపారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు.
Updated Date - 2022-01-09T06:24:33+05:30 IST