ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుమేహంపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2022-11-15T01:09:28+05:30

మనిషి జీవనశైలిలో మార్పుల కార ణంగా అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులో మధుమేహం ఒకటని, దీనిపై అవగాహన పెంచుకుని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల పర్య వేక్షణలో మందులు వాడాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు.

వీజీఆర్‌ డయాబెటిస్‌ అట్లాస్‌ను అవిష్కరిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, కలెక్టర్‌ దిల్లీరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్రాజపురం, నవంబరు 14: మనిషి జీవనశైలిలో మార్పుల కార ణంగా అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులో మధుమేహం ఒకటని, దీనిపై అవగాహన పెంచుకుని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల పర్య వేక్షణలో మందులు వాడాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. సోమవారం ప్రపంచ మఽధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధార్థ ఆడిటో రియంలో వీజీఆర్‌ డయోబెటిస్‌ స్పెషాలిటీస్‌ హస్పిటల్‌ అధినేత డాక్టర్‌ కె.వేణు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి రెండు దశాబ్దాలుగా మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. మరో ముఖ్య అతిథి హైకోర్టు జడ్జి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమ యాజులు మాట్లాడుతూ మధుమేహం మనిషి జీవితంలో భాగమవడం ఆం దోళన కలిగించే అంశమన్నారు. విద్యార్థి దశ నుంచే దీనిపై అవగాహన అవసర మన్నారు. మధుమేహ రహిత సమాజం కోసం అందరూ పనిచేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్‌ వి.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్టు తరఫున రెండు దశాబ్దాల నుంచి వ్యాధి నియంత్రణ, నివారణపై విద్యార్ధులకు, వ్యాధిగ్రస్తులకు అర్థమ య్యేలా సరళమైన భాషలో వీజీర్‌ డయాబెటీస్‌ అట్లాస్‌, స్టూడెంట్‌బుక్‌ లెట్‌, పేషంట్‌గైడ్‌ పేరిట ప్రత్యేకంగా రచించిన 8లక్షల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 10లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌, డాక్టర్‌ ఇండ్ల రామ సు బ్బారెడ్డి, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి, పాతూరి నాగ భూ షణం మాట్లాడారు. ముఖ్య అతిథులు వీజీఆర్‌ డయాబెటిస్‌ అట్లాస్‌ను అవి ష్కరించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-11-15T01:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising