ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవినేని ఇంటి ముందు ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-12-07T00:07:04+05:30

వైసీపీ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్‌ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు జరుగుతుండటంతో గుణదలలోని ఆయన ఇంటి వద్ద ఉద్రికత్త వాతావరణ ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనసాగుతున్న ఐటీ సోదాలు

భారీగా చేరుకున్న అనుచరులు

ఏలూరు రోడ్డులో బైఠాయింపు

విజయవాడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్‌ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు జరుగుతుండటంతో గుణదలలోని ఆయన ఇంటి వద్ద ఉద్రికత్త వాతావరణ ఏర్పడింది. ఐటీ సోదాల విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అవినాష్‌ అనుచరులు, పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద గూమిగూడారు. కొంతమంది అనుచరులు ఏలూరు రోడ్డులో బైఠాయించారు. దీంతో ఏలూరు రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రామవరప్పాడు రింగ్‌ వైపు నుంచి మాచవరం వైపునకు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఉత్తర మండలం సహాయ కమిషనర్‌ సీహెచ్‌ రవికాంత్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు పెంచారు. మాచవరం, గుణదల, పటమట ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్‌, కృష్ణమోహన్‌, సీహెచ్‌ కాశీవిశ్వనాథ్‌లతో అవినాష్‌ ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. ఐటీ సోదాలు జరుగుతున్నంతసేపు అవినాష్‌ అనుచరులు ఆయన ఇంటి వద్దే ఉన్నారు.

Updated Date - 2022-12-07T00:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising