ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి కానుకల చోరీ కేసులో అటెండర్‌ Arrest

ABN, First Publish Date - 2022-05-15T16:49:56+05:30

దుర్గగుడి కానుకల చోరీ కేసులో అటెండర్‌ Arrest

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా/వన్‌టౌన్‌ : ఇటీవల దుర్గగుడి (Durga Temple) హుండీలలోని కానుకల లెక్కింపులో వేర్వేరు తేదీల్లో నగదు, బంగారం వస్తువులను అపహరించిన దుర్గగుడి అటెండర్‌ కగ్గాపుల్లారావు(పుల్లయ్య 51)ను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కొల్లి శ్రీనివాసరావు, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ, డాక్టర్‌ కె.హనుమంతరావు, క్రైం ఏసీపీ సీహెచ్‌శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వెస్ట్‌డీ సీపీ కె.బాబూరావు వివరాలను వెల్లడించారు.


పుల్లారావు ఈనెల 9వ తేదీన బంగారు వస్తువులు (Gold), రూ.4వేలు, ఏప్రిల్‌ 11వ తేదీన రూ.10వేలు, 20వతేదీన రూ.6 వేలు నగదు టాయ్‌లెట్‌లో (Toilet) దాచిపెట్టి, తరువాత వాటిని తీసుకువెళ్లడానికి ప్లాన్‌ (Plan) చేశాడని తెలిపారు. ఈవో ఫిర్యాదు మేరకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి,  సీసీకెమెరాల (CC Camera) ద్వారా, ఆలయంలోని సిబ్బందిని విచారించడం ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. కేసును చేధించిన సిబ్బందికి రివార్డును ప్రకటించినట్టు తెలిపారు. నిందితుడిపై గతంలో చీరల (Saree) దొంగతనంపైన కూడా ఫిర్యాదు ఉన్నది. నిందితుడు పలుమార్లు చోరీ యత్నం చేయడంతో దుర్గగుడిపై నిఘా వైఫల్యం తేటతెల్లమవుతోంది.

Updated Date - 2022-05-15T16:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising