ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీక్షగా..

ABN, First Publish Date - 2022-12-15T00:30:19+05:30

అరుణవర్ణం అంబరమై సంబరపడింది.. విద్యుద్దీపాలు వెలుగుల తోరణాలు కట్టాయి.. మండల కాలం పాటు దుర్గమ్మ దీక్షబూనిన భక్తులకు క్యూలైన్లు సాదర స్వాగతం పలికాయి.. తన చుట్టూ తిరిగే భవానీ భక్తుల పాదస్పర్శ కోసం ఇంద్రగిరి ఆశగా చూసింది. కృష్ణమ్మ పరవళ్లు తిరునాళ్ల కోలాహలంగా మారగా, దుర్గమ్మ సన్నిధి ధగధగ మెరిసిపోయింది. భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం

మూడు హోమగుండాల ఏర్పాటు

గిరిప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచే క్యూలైన్లు

ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఆంక్షలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : భవానీ దీక్షల విరమణ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. భవానీలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఇంద్రకీలాద్రిపై అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీక్షల విరమణ కోసం మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మూడు హోమగుండాలను సిద్ధం చేశారు. గురువారం ఆరు గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 6.30 గంటలకు హోమగుండాల వద్ద అగ్నిప్రతిష్ట చేస్తారు. అక్కడి నుంచి మాల విరమణ మొదలవుతుంది. ఈ ఉత్సవాలు ఈనెల 19వ తేదీ వరకు జరుగుతాయి. అనంతరం పూర్ణాహుతితో విరమణకు ముగింపు పలుకుతారు.

ఏడు లక్షలమంది వస్తారని అంచనా

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిసా నుంచి దాదాపు ఏడు లక్షల మంది భవానీ భక్తులు ఇంద్రకీలాద్రి వస్తారని అధికారులు అంచనా వేశారు. దసరాలో మాదిరిగానే ఉచిత దర్శనం క్యూలైన్‌ను వినాయకుడి ఆలయం నుంచి ఏర్పాటు చేశారు. మాల ధరించిన భక్తులతో పాటు సాధారణ భక్తులు ఈ మార్గంలోనే దర్శనానికి వెళ్లాలి. ఘాట్‌రోడ్డులోని ఓం మలుపు నుంచి రూ.500, రూ.300 దర్శన క్యూలు ప్రారంభమవుతాయి. రూ.500 దర్శనానికి వెళ్లే భక్తులను బస్సుల్లో ఘాట్‌రోడ్డు మీదుగా ఓం మలుపు వరకు తీసుకెళ్తారు. రైల్వేస్టేషన్‌, పున్నమిఘాట్‌, భవానీఘాట్‌ వద్ద నుంచి ఇంద్రకీలాద్రిపైకి బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తలనీలాలు సమర్పించిన భక్తులు స్నానాలు ఆచరించడానికి వీలుగా పున్నమిఘాట్‌, భవానీఘాట్‌, సీతమ్మవారి పాదాల వద్ద జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. ఇక 14 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు గురువారం సుమారు లక్షమంది వరకు భవానీ మాలధారులు వస్తారని గురు భవానీలు చెబుతున్నారు. భవానీలు తీసుకొచ్చే ఇరుముడులు విప్పడానికి మహామండపం దిగువన స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రక్రియను నిర్వహించడానికి 300 మంది గురు భవానీలు వస్తున్నారు. 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

శివాలయం మెట్ల వద్ద అన్నదానం

శివాలయం మెట్ల వద్ద మహామండపం దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో అన్నదానం చేయాలని నిర్ణయించారు. దర్శనాలు ప్రారంభమయ్యే సమయం నుంచి మధ్యాహ్నం వరకు పులిహోరను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం నుంచి భోజనాలు పెడతారు. రాత్రికి అల్పాహారం అందజేస్తారు. మహా మండపంలోని మూడో అంతస్థులో రోజుకు 4,500 మంది వరకు భోజనాలు చేస్తారు. శివాలయం పక్కన నిర్వహించే అన్నదానంలో 5వేల మంది భోజనం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తాత్కాలికంగా షెడ్లను నిర్మిస్తున్నారు.

లడ్డూ మాత్రమే..

దీక్షల విరమణలో భక్తులకు పులిహోరను అందుబాటులో ఉంచలేమని దేవస్థాన అధికారులు తేల్చేశారు. లడ్డూ ప్రసాదం కొన్నిరోజుల పాటు నిల్వ ఉంటుందని, అదే పులిహోర ప్రసాదం మిగిలిపోతే పాడైపోతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పులిహోర ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికే తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-15T00:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising