ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదాశయానికి తూట్లు

ABN, First Publish Date - 2022-08-04T06:32:14+05:30

పోర్టురోడ్డులో అసంపూర్తిగా మిగిలిపోయిన అనాథ పిల్లల హాస్టల్‌ భవనం అసాంఘిక కార్యాలయాలకు అడ్డాగా మారిపోయింది.

పోర్టు రోడ్డులో అసంపూర్తిగా అనాథ పిల్లల హాస్టల్‌ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసాంఘిక శక్తుల తిష్ట  

 ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మహానుభావుల సదాశయం నెరవేరడం లేదు. మండలి వెంకట కృష్ణారావు లాంటి నేత మహదాశయంతో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు అప్పట్లో బందరు పోర్టు రోడ్డులోని పెంకుటింట్లో హాస్టల్‌ ఏర్పాటు చేశారు. అది శిథిలం కావడంతో  గత ప్రభుత్వ హయాంలో పక్కా భవనం నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ భవన నిర్మాణాన్ని గాలికి వదిలేసింది.  అసంపూర్తిగా ఆ భవనం మిగిలిపోవడంతో మహోన్నతుల సదాశయం నెరవేరకపోగా  అసాంఘిక కార్యాలయాలకు నెలవుగా మారింది.  భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే అనాథ పిల్లలకు హాస్టల్‌ భవనం అందుబాటులోకి వస్తుంది. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడుతుంది. 

మచిలీపట్నం టౌన్‌ :  పోర్టురోడ్డులో అసంపూర్తిగా మిగిలిపోయిన అనాథ పిల్లల హాస్టల్‌ భవనం అసాంఘిక కార్యాలయాలకు అడ్డాగా మారిపోయింది.  మందు బాబుల ఆగడాలు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయి. అసంపూర్తి భవనం దగ్గరలో నివసిస్తున్న ప్రజలకు, సీడీపీవో కార్యాలయ సిబ్బందికి ఇబ్బందిగా తయారైంది. మందుబాబుల ఆగడాలకు భయపడి మహిళలు ఎవరికీ చెప్పుకోలేక దిగమింగుతున్నారు. ఎవరికి చెబితే ఏమవుతుందో అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. దివిసీమ ఉప్పెన సమయంలో  1977లో బందరులో దాతల సహకారంతో ఒక పెంకుటింట్లో అప్పటి మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు అనాథ పిల్లల హాస్టల్‌ను ప్రారంభించారు. అప్పటి  భవనం శిథిలం కావడంతో  మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ భవన పునర్నిర్మాణం  చేపట్టింది. నిధులు కొరత వల్ల ఆగిపోయిన ఈ భవనానికి గద్దె అనూరాధ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో మరికొంత నిఽధులు సమకూర్చారు. ఈ భవనంలో బాలసదనం తోపాటు శిశుగృహ, సీడీపీవో కార్యాలయం ఏర్పాటు చేసే ఉద్దేశంతో రెండో అంతస్తు నిర్మాణం ప్రారంభించారు. ఆరేళ్లుగా హాస్టల్‌ భవనం నిర్మాణం పూర్తి కాలేదు. శిశు గృహ కోసం నిర్మించిన భవనంలో సీడీపీవో కార్యాలయం ఏర్పాటు చేశారు. అసంపూర్తి హాస్టల్‌ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది.  ఈ భవనానికి పక్కనే ఉన్న సీడీపీవో కార్యాలయం సిబ్బంది చీకటి పడితే చాలు ఆఫీసులకు తాళాలు వేసి వెళ్లి పోతున్నారు.  హాస్టల్‌  భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో శిశుగృహలోని అనాథ పిల్లలు, బాలసదన్‌లోని అనాథ పిల్లలు  అద్దె భవనాల్లోనే ఉంటున్నారు. ఈ భవన నిర్మాణాలు పూర్తి కాకాపోవడంతో ప్రభుత్వానికి అద్దె చెల్లించక తప్పడం లేదు. విద్యార్థులు అరకొర సదుపాయాలు ఉన్న హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ భవన నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించి అనాథ పిల్లలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మందుబాబుల ఆగడాలకు  అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2022-08-04T06:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising