ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా సమస్యలపై జనసేన నిరసన

ABN, First Publish Date - 2022-12-31T00:56:10+05:30

ఆక్వా రైతులకు పొరుగు జిల్లాలో విద్యుత్‌ సబ్సిడీ వస్తుంటే జిల్లాలోని మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్‌బాబు ఏం చేస్తున్నారని జనసేన పార్టీ నేత మండలి రాజేష్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగాయలంక, డిసెంబరు 30 : ఆక్వా రైతులకు పొరుగు జిల్లాలో విద్యుత్‌ సబ్సిడీ వస్తుంటే జిల్లాలోని మంత్రి జోగి రమేష్‌, మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్‌బాబు ఏం చేస్తున్నారని జనసేన పార్టీ నేత మండలి రాజేష్‌ ప్రశ్నించారు. శుక్రవారం నాగాయలంక కూడలిలో ఆక్వా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనసేన పార్టీ నేతలు, రైతులతో కలసి ఽధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం మీద ఒక్క గుంటూరు జిల్లాకే మాత్రమే విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వటానికి కారణం ఏమిటో చెప్పాల్నారు. అక్కడ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణరావు ఆక్వా చెరువులు పెద్ద సంఖ్యలో ఉండటానికి కారణం కాదా ? అని వారు అన్నారు. సింహాద్రి రమేష్‌బాబు చెరువులు కూడా గుంటూర ు జిల్లాలోనే ఉండటంతో విద్యుత్‌ సబ్సిడీని అనుభవిస్తూ ఆయన ఆక్వా రైతుల సమస్యలను మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. పేర్ని నాని మచిలీపట్నం వీడి తాడేపల్లిలో కాపురం పెట్టారన్నారు. జోగి రమేష్‌ పెద ్ద జోకర్‌, చెరువు తవ్వితే 20 వేలు కప్పం కట్టాలి, రైతులు దగ్గర వసూలు చేస్తారని ఆక్వా రైతులకు సబ్సిడీ ఇప్పించటం చేతగాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గాజుల శంకరరావు, పద్యాల వెంకట ప్రసాద్‌, లంకే యుగంధర్‌, గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, లేబాక అంకాలరావు, రేమాల మురళీ, బండ్రెడ్డి మల్లికార్జునరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising