డాక్టర్ అబ్దుల్ కలాంకు ఘననివాళి
ABN, First Publish Date - 2022-10-16T06:28:38+05:30
మాజీ రాష్ట్రప తి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం వేర్వేరు ప్రాంతాలలోని టీడీపీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
విద్యాధరపురం, అక్టోబరు 15 : మాజీ రాష్ట్రప తి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం వేర్వేరు ప్రాంతాలలోని టీడీపీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
టీడీపీ జిల్లా కార్యాలయంలో..
ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మచిలీపట్నం ‘ముడ’ మాజీ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, మైనార్టీ నేతలు షేక్ రషీద్ కలాం చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి ఉషారాణి, నేతలు గొల్లపూడి నాగేఽశ్వరరావు, పామర్తి కిషోర్‌బాబు, శొంఠి శివరాంప్రసాద్, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, పోతురాజు, సజ్జ రవి, ఈడ్పుగంటి అజయ్, విజయకుమార్ పాల్గొన్నారు.
కేశినేని భవన్‌లో..
గవర్నర్‌పేటలోని కేశినేనిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీం టీడీపీ నేతలు కలాం చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొమ్మినేని భావన్నారాయణ మాట్లాడుతూ కలాం సేవలు దేశచరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు.
కేశినేని శివనాథ్ కార్యాలయంలో..
మొగల్రాజపురంలోని టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో నిర్వహి ంచిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి శివనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా ఆయన కలాం సేవలను గుర్తు చేసుకున్నారు. కొట్టేటి హనుమంతరావు, శివాజీ, అన్వర్, హబీబ్, చింతా వెంకటేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, ప్రసన్న వెంకటేశ్వరరావు, వై శ్రీనివాస్ శర్మ, స్వర్ణనాగరాజు, పీ వీరారెడ్డి పాల్గొన్నారు.
కలాంకు మేయర్, కమిషనర్ నివాళి
చిట్టినగర్ : మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దు ల్ కలాం జయంతిని వీఎంసీ ప్రధాన కార్యాలయం లో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత మే యర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కా ర్పొరేటర్ మహదేవు అప్పాజీరావు, అదనపు కమిషనర్ (జనరల్) ఎం.శ్యామల, అదనపు కమిషనర్ ప్రా జెక్ట్ కె.వి.సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, యూసీడీ పీవో శకుంతల, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎ్‌స.వి. ప్రసాద్, ఏడీహెచ్ శ్రీనివాసు పాల్గొన్నారు.
కలాం సేవలు అపూర్వం
వన్‌టౌన్ : దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అ బ్దుల్ కలాం సేవలు అపూర్వమని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి నారాయణరావు అన్నారు. కళాశాల ఎన్‌ఎ్‌సఎస్ విభాగాల ఆధ్వర్యంలో శనివారం కలాం జయంతిని నిర్వహించారు. కళాశాల కార్యాలయంలో కలాం చిత్రపటానికి కళాశాల యాజమా న్యం, అధ్యాపకులు పూలమాలలతో నివాళులు అర్పించారు. వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వరరావు, పీఎల్ రమేష్, ఏక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ జి.కృష్ణవేణి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాగ్యకుమార్, ఎన్‌ఎ్‌సఎస్ ప్రోగ్రాం అధికారులు వీఎ్‌సరావు, డి.పవన్‌కుమార్, ఎన్ సాంబశివరావు, క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-16T06:28:38+05:30 IST