ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

ABN, First Publish Date - 2022-08-13T05:58:42+05:30

అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

సీఐ శివాజీకి రాఖీ కడుతున్న తెలుగు మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, ఆగస్టు 12: సోదర భా వాన్ని మరింత పెంపొందించేందుకు రక్షా బంధన్‌ గుర్తు చేస్తుందని తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమా దేవి అన్నారు.  పట్టణంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో సీఐ కె.శివాజీ, ఎస్సై రమేష్‌ బాబు, పలువురు అధికారులకు మండల అధ్యక్షురాలు నాగమణితో కలసి శుక్రవారం రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. 

హనుమాన్‌జంక్షన్‌ : స్థానిక ఆదిత్య బధిర విద్యాలయంలో విద్యార్థులు రాఖీ పండుగను వేడుకగా శుక్రవారం జరుపుకున్నారు.  ఈ సందర్భంగా పాఠశాల కర స్పాడెంట్‌ ఇమంది అన్నపూర్ణ రాఖీ పండుగ విశిష్ఠతను తెలియజేశారు.  

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : బాపులపాడు మండల గ్రామాల్లో రాఖీపౌర్ణమిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగన్నగూడెం సర్పంచ్‌ కసుకుర్తి రంగా మణి రాష్ట్ర సాగునీటి సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణకు రాఖీ కట్టి మిఠాయిలు అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.  

పెనమలూరు :  శ్రావణమాస శుక్రవారం పర్వదినాన రాఖీపౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ ఆప్యాయతలను చాటుకున్నా రు. స్థానిక సీఎస్కే పాఠశాలలో రక్షాబంధన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది.    

Updated Date - 2022-08-13T05:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising