ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనాడు Amaravathiపై విష ప్రచారం చేశారు.. ఇప్పుడు Lands ఎలా అమ్మతారు: జేఏసీ నేతలు

ABN, First Publish Date - 2022-06-27T17:51:30+05:30

అమరావతి భూములు అమ్మాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జేఏసీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): అమరావతి (Amaravathi) భూముల అమ్మకంతో పాటు ఇప్పటికే నిర్మించిన టవర్స్‌ను లీజుకు ఇవ్వాలని జగన్ (Jagan) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమరాతి రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం  అమరావతి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమరావతిని ఎడారిగా పోల్చారని, అలాగే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతిపై విష ప్రచారం చేశారని.. ఇప్పుడు ఆ భూములు ఎలా అమ్మతారని ప్రశ్నించారు. ఏపీని అభివృద్ధి చేయకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అమరావతి భూములు అమ్మకానికి ప్రభుత్వం పెడుతోందని మండిపడ్డారు. అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని.. అయితే అదొక సాకని తాము నమ్ముతున్నామన్నారు. ఎందుకంటే అమరావతే ఏపీ రాజధాని అని అధికారంలోకి వచ్చిన జగన్ మూడేళ్లలో ఎక్కడ, ఏ మీడియా సమావేశాల్లో ప్రకటించలేదని నేతలు అన్నారు. సీఆర్డీయే అధికారులు కూడా అమరావతి రైతులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రైతులకు న్యాయం చేయకుండా భూములు ఎలా అమ్ముతారని వారు ప్రశ్నించారు.


గత ప్రభుత్వం అసైన్డు రైతులను ఆదుకునే విధంగా, అమ్మకాలు, కొనుగోలు చేసే విధంగా జీవో తీసుకువచ్చారని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆ జీవోను రద్దు చేశారని, ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తామని చెబితే తాము నమ్మే పరిస్థితి లేదన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని, అలా చేస్తే  తాము స్వాగతిస్తామని నేతలు అన్నారు. అలాగే అమరాతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేస్తామని ప్రకటన చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జేఏసీ నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-27T17:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising