ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దౌర్జన్యాలకు నిరసనగా నేడు దీక్ష

ABN, First Publish Date - 2022-05-16T06:29:46+05:30

52 ఏళ్లుగా ఎన్నడూ చూడని విఽధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండలాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని అమరావతి బహుజన జేఏసీ ఆధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోటయ్య

ధర్నాచౌక్‌, మే 15 : 52 ఏళ్లుగా ఎన్నడూ చూడని విఽధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండలాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని అమరావతి బహుజన జేఏసీ ఆధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై పౌరసమాజం స్పందించాలని, దీనిపై స్థానిక ధర్నాచౌక్‌లో సోమవారం దీక్ష చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం ఇంటి సమీపంలోనే మహిళలపై అత్యాచారాలు జరగడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంఘటనలపై ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనలపై ప్రభుత్వ చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మాస్క్‌ అడిగినందుకు ఒక డాక్టర్‌, మాస్క్‌ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడు, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఓ దళితుడు ప్రాణాలు కోల్పోయారన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయకుండా దళితులకు జీవనోపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా మేధావులు, ప్రజాసంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు, కుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించి ముఖ్యమంత్రికి గట్టి సందేశం ఇవ్వాలని కోరారు. మైనార్టీ నేత మౌలానా హుస్సేన్‌, జేఏసీ నేతలు మామిడి సత్యం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising