ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభంలో వ్యవసాయం

ABN, First Publish Date - 2022-09-19T06:01:38+05:30

జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని,

జగ్గయ్యపేట సమావే శంలో మాట్లాడుతున్న నెట్టెం, తాతయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ ధ్వజం

జగ్గయ్యపేట, సెప్టెంబరు 18: జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, అన్నదాత లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే, జాతీయ తెలుగుదేశం కోశాధికారి శ్రీరాం తాతయ్యలు ధ్వజమెత్తారు.  నెట్టెం నివాసంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ అప్పులకు ఆశపడి జగన్‌ ప్రభుత్వం  మోటార్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించిందన్నారు. రైతుభరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయన్నారు.  ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ.4వేల కోట్లు ఏర్పాటు చేస్తామన్న మాటలు నీటిమూటలేనని ఎద్దేవా చేశారు. సమావేశంలో జిల్లా పార్టీ నేతలుకట్టా నరసింహారావు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గట్టిడి దుర్గా ప్రసాద్‌, దూళిపాళ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

తిరువూరు :  రైతులను వ్యవసాయానికి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ  రైతువిభాగం నాయకులు విమర్శించారు. ఆదివారం నియోజకవర్గం టీడీపీ కార్యక్రమంలో ఇన్‌చార్జి శావల దేవదత్‌, టీడీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, నియోజకవర్గం అధ్యక్షుడు దొడ్డా లక్ష్మణరావు మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాలో రైతులు క్రాప్‌ హలిడే ప్రకటించారంటే రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా  కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి కొందరు రైతులకు నగదు ఇవ్వలేదన్నారు. రైతు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే, వైసీపీ వ్యవసాయానికి దూరం చేస్తుందని ఆరోపించారు.  సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌, తెలుగురైతు నాయకులు చెంచురెడ్డి, కనకమేడల బుచ్చిసుందరరావు, దమ్మలపాటి సాంబశివరావు, చప్పిడి సత్యనారాయణ, నెక్కళపు శ్రీనివాసారావు, శివకుమార్‌, పాల్గొన్నారు.


Updated Date - 2022-09-19T06:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising