ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలిచ్చి ఆదుకోండి సీఎంకు

ABN, First Publish Date - 2022-12-10T01:18:29+05:30

తక్షణమే తమకు ఉద్యోగ నియామకా లు చేపట్టి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని 1998 డీఎస్సీ క్వాలీఫైడ్‌ అభ్యర్థులు సీఎం జగన్‌కు మొరపెట్టుకున్నారు.

ధర్నా చేస్తున్న 1998 డిఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్నాచౌక్‌, డిసెంబరు 9 : తక్షణమే తమకు ఉద్యోగ నియామకా లు చేపట్టి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని 1998 డీఎస్సీ క్వాలీఫైడ్‌ అభ్యర్థులు సీఎం జగన్‌కు మొరపెట్టుకున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తమ ఉద్యోగాల నియామక ఫైల్‌పై జూన్‌ 17న సీఎం జగన్‌ సంతకం చేశారని, కాని ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని వాపోయారు. స్థానిక ధర్నాచౌక్‌లో 1998 క్వాలిఫైడ్‌ టీచర్స్‌ శుక్రవారం ధర్నా నిర్వహించారు. తమకు తక్షణమే నియామక ఉత్తర్వులు అందించేలా అధికారులను ఆదేశించి న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. జె.కిషోర్‌, సలాది సత్యనారాయణ, టి.ప్రభాకర్‌ పాల్గొన్నారు. 2009లో అనారోగ్యంతో తన రెండు కాళ్లు కోల్పోయానని తనకు వచ్చే పెన్షన్‌ రూ. 3వేలతోనే జీవనం సాగిస్తున్నని పార్వతీపురం మన్యం జిల్లా కాశీపట్నంకు చెందిన జి.భాస్కర్‌ అనే క్వాలిఫైడ్‌ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన తమకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

Updated Date - 2022-12-10T01:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising