ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

65 మంది బడిబాట పట్టారు!

ABN, First Publish Date - 2022-10-08T06:08:23+05:30

65 మంది బడిబాట పట్టారు!

తల్లిదండ్రులతో మాట్లాడుతున్న కోడూరు మెయిన్‌ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం నాగభూషణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడూరు, అక్టోబరు 7: కోడూరు-1, 2, 3 సచివాలయాల పరిధిలో 18 మంది, ఉల్లిపాలెంలో 8, పిట్టలంకలో ఒకరు, సాలెంపాలెంలో నలుగురు, మందపాకలలో 13, వి.కొత్తపాలెంలో 9 మంది, విశ్వనాథపల్లిలో ఇద్దరు, రామకృష్ణాపురంలో ముగ్గురు, లింగారెడ్డి పాలెంలో ఏడుగురు బడి మానేసిన విద్యార్థులను బడిబాట పట్టించినట్లు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు తెలిపారు. శుక్రవారం మండలంలోని 11 సచి వాలయాల పరిధిలో ఉపాధ్యాయులు, సచివాలయ కార్య దర్శులు, సంక్షేమ, విద్యా సహాయకులు, మహిళా పోలీసులు ఇంటింటికి తిరిగి 65 మందిని తిరిగి బడిబాట పట్టించారు.  కోడూరు మెయిన్‌ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం కాశీభొట్ల నాగభూషణం, సచివాలయ కార్యదర్శి శైలజ తలి ్లదండ్రులకు చదువు ఆవశ్యకతను వివరించి, చిన్నారులకు పాఠశాలలో అడ్మిషన్‌ కల్పించారు. ఎంపీడీవో నాగరేవతి, ఈవో సుబ్రహ్మణ్యం, కార్యదర్శులు సుధీర్‌, ఏడుకొండలు పర్యవేక్షించారు. 



Updated Date - 2022-10-08T06:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising