ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.6.20 కోట్లతో అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2022-06-25T06:06:45+05:30

రూ.6.20 కోట్లతో అభివృద్ధి పనులు

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయవాడ రూరల్‌, జూన్‌ 24 :  మండలంలో రూ.6.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలు చెన్ను ప్రసన్నకుమారి చెప్పారు. వీటిలో తాగునీటి సౌకర్యంం, సీసీ రోడ్లు, డ్రెన్ల వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ప్రసన్నకుమారి అఽధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం నిధులతో అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్లలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు  చేపట్టామన్నారు.  గత మండల పరిషత్‌ సమావేశంలో మరో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఇప్పటికే పనులన్నీ శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.   గన్నవరం, మైలవరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వసంత కృష్ణ ప్రసాద్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె చెప్పారు.  ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, వైస్‌ ఎంపీపీ వేమూరి సురేష్‌, కె సరితాదేవి, ఇన్‌చార్జి ఎంపీడీఓ బీఎల్‌వీ శేషగిరిరావు, తహసీల్దార్‌  సాయి శ్రీనివాస్‌ నాయక్‌, ఏవో హరీష్‌,  ఎంఈవో ఆదూరి వెంకట రత్నం, ఎంపీడీవో కార్యాలయ ఏవో కె శకుంతల, ఉద్యానశాఖాధికారి చందు జోసఫ్‌, పలు ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising