ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం’

ABN, First Publish Date - 2022-06-28T23:42:01+05:30

కోటి రూపాయల ఆదాయం లోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోటి రూపాయల ఆదాయం లోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాలయాల్లో కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఖర్చు చేసే నిధులు, అభివృద్ధి పై ప్రతివారం సమీక్ష చేస్తున్నామన్నారు. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఉన్న దేవాలయాలలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు. వంద కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. దేవాదాయ శాఖలో ఆడిట్ జరగటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. 2022 మార్చి నాటికి ఆడిట్ నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 195 6ఏ కేటగిరీకి చెందిన దేవాలయాల ఆడిట్ పూర్తి అవుతోందని ఆయన తెలిపారు. వీటిని త్వరలోనే అన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. 


మరో 1425 6 బి కేటగిరీ దేవాలయాల లోనూ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అవకతవకలు ఉంటే రికవరీ కూడా సదరు అధికారిని బాధ్యుడుగా చేస్తామని చెప్పారు. 11 వేల దస్త్రాలను గడచిన 4-5 నెలల్లో పరిష్కరించామన్నారు. అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా  మందికి అర్చకులకు 20 కోట్ల మేర వ్యయం అయ్యిందన్నారు. దేవాలయాలకు సంబధించిన అన్ని అంశాలు పారదర్శకంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో అన్‌లైన్ విధానం ద్వారానే లావాదేవీలు జరిగేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే కాణిపాకం దేవాలయంలో ఈ వ్యవస్థ చేపట్టామన్నారు. 

 

Updated Date - 2022-06-28T23:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising