ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా విద్యకు జ్యోతి బాపులే ఆద్యుడు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-04-11T18:39:51+05:30

హిళా విద్యకు జ్యోతి బాపులే ఆద్యుడని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహిళా విద్యకు మహాత్మ జ్యోతిబాపులే ఆద్యుడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో జ్యోతిబాపులే జయంతిని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆధునిక భారతదేశ సామాజిక ఉద్యమపితామహుడు జ్యోతిబాపులే, దేశానికి ఆయన చాలా సేవలు చేశారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. చంద్రబాబునాయుడు బీసీ పక్షపాతి. దేశ చరిత్రలో మొట్టమెదటి సారిగా రూ. 64 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశాం.ఒక్కొక్కరికీ రూ. 15 లక్షలతో 975 మంది బీసీ విద్యార్ధులకు విదేశీ విద్య అందించాం.జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో  బీసీలకు ఏం న్యాయం  చేశారో చెప్పగలరా ?’’ అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు .

‘‘నాడు 139  కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్న జగన్  56 కార్పొరేషన్లకు కుదించారు. వాటికి కనీసం ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34  శాతం నుంచి 24  శాతానికి తగ్గించి 16 వేల మంది బీసీలను రాజకీయ పదవులను దూరం చేశారు. చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బీసీకి ఇస్తే జగన్ మాత్రం సొంతబాబాయికి ఇచ్చారు.జగన్ సలహాదారుల్లో బీసీలు ఎంతమందో ఉన్నారో చెప్పాలి?. టీడీపీ బీసీ నాయకులపై జగన్  అక్రమ కేసులు పెడుతున్నారు.జగన్ భయపెడితే  మేం భయపడం, ఆకలినినైనా  చంపుకుంటాం గానీ మా ఆత్మగౌరవాన్ని చంపుకోం. జగన్ దుర్మార్గాలపై  పోరాటం  చేస్తాం.చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది’’ అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Updated Date - 2022-04-11T18:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising