ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భక్తులకు అవగాహన కల్పించకుండా ప్లాస్టిక్ నిషేధం అమలు కరెక్టేనా?’

ABN, First Publish Date - 2022-06-20T17:43:31+05:30

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం స్వాగతిస్తున్నామని.. అయినప్పటికీ భక్తులకు అవగాహన కల్పించకుండా నిషేధం అమలు చేయడం కరెక్టేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : తిరుమల(Tirumala)లో ప్లాస్టిక్ నిషేధం స్వాగతిస్తున్నామని.. అయినప్పటికీ భక్తులకు అవగాహన కల్పించకుండా నిషేధం అమలు చేయడం కరెక్టేనా? అని తిరుపతి జనసేన(Janasena) ఇన్‌చార్జి కిరణ్ రాయల్ ప్రశ్నించారు. నేడు ఆయన జనసేన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చిన్న పిల్లలు పాల సీసాలను కూడా ప్లాస్టిక్ పేరుతో అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది లాక్కుంటున్నారన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పిల్లల కోసం తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్లను కూడా లాక్కుంటున్నారన్నారు. పాండిచ్చేరీలో బీర్ రేటుకు తిరుమలలో వాటర్ అమ్ముతున్నారని కిరణ్ రాయల్ విమర్శించారు. రూ.15 విలువజేసే గాజు వాటిర్ బాటిళ్లను రూ.55 కు విక్రయిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుమలలో గాజు వాటర్ బాటిళ్ల వ్యాపారం వైసీపీ నాయకులవేనన్నారు. తిరుమలలో నీటి వ్యాపారం చేస్తున్న వైసీపీ నాయకులకు హుండీ ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తోందేమోనని అనుమానంగా ఉందని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. నిన్న ఒక వ్యక్తి గాజు బాటిల్‌ను పగలగొట్టుకుని శ్రీవారి ఆలయం ముందే పొడుచుకున్నాడన్నారు. తిరుమలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూపించే వరకూ జనసేన భక్తుల తరపున పోరాడుతుందని కిరణ్ రాయల్ వెల్లడించారు.

Updated Date - 2022-06-20T17:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising