ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్వేదిలో మత్స్యకారుడి వలకు చిక్కిన కిచిడి..

ABN, First Publish Date - 2022-02-08T17:25:48+05:30

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. దీని బరువు 21 కేజీలు. కిచిడీ అనే మగ చేప అంతర్వేది సముద్రతీరంలో మత్స్యకారుడి వలకు చిక్కింది. దీన్ని ఫిషింగ్ హార్బర్‌లో వేలం వేయగా నరసాపురానికి చెందిన వ్యాపారస్తులు లక్షా 50 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. భారీ కిచిడీ చేపను చూసేందుకు స్థానికులు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. ఈ చేప పొట్ట భాగాన్ని వైద్య ఔషధాల తయారీకి వాడతారని మత్స్య శాఖ ఏడీ కృష్ణారావు తెలిపారు.


కాగా.. కొద్ది రోజుల క్రితం కూడా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడి వలకు కిచిడి చేప చిక్కింది. అంతర్వేది చేపల మార్కెట్‌లో ఈ చేప ధర ఏకంగా రూ.2 లక్షల 60 వేల ధర పలికింది. అయితే మత్స్యకారుడికి దొరికిన ఆ చేపలో ఔషధ గుణాలుండడమే అంత ధర పలకడానికి అసలు కారణంగా తెలిసింది. కాగా.. ఈ చేప పొట్ట భాగాన్ని ఆపరేషన్లలో కుట్లు వేయడానికి వాడే దారం తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్లలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. 

 

Updated Date - 2022-02-08T17:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising