ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కావలి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-08-27T20:16:52+05:30

కావలి (Kavali) రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గిరాల కరుణాకర్ మృతిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: కావలి (Kavali) రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గిరాల కరుణాకర్ మృతిపై ఆర్డీవో శీనానాయక్ అధ్యక్షతన విచారణ జరిగింది. విచారణలో కరుణాకర్ తల్లీ కొండమ్మ సృహతప్పి పడిపోయారు. దీంతో కొండమ్మను బంధువులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు కరుణాకర్ భార్య నిరోషా మీడియాతో మాట్లాడుతూ తన భర్త కరుణాకర్ మృతికి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి కారణమని తెలిపారు. అప్పుల బాధలతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం అవాస్తవమన్నారు. ప్రభుత్వం తన కుటుంబానికి న్యాయం చేయాలని నిరోషా కోరారు. 


కరుణాకర్‌ కావలి రూరల్‌ మండలం అన్నగారిపాలెం ఫిషర్‌మెన్‌ సొసైటీ ద్వారా ముసునూరులోని రెండు చెరువులను నాలుగేళ్ల క్రితం సబ్‌ లీజుకు తీసుకున్నాడు. మూడేళ్లుగా ముసునూరుకు చెందిన వైసీపీ (YCP) నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి అనుచరులు.. కరుణాకర్‌ను చేపలు పట్టుకోనివ్వకుండా వేధిస్తున్నారు. గతేడాది కూడా చేపలు పట్టుకోవాలనుకున్నా.. చెరువులో నీరు వదలనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు.  రూ.6 లక్షలతో చేపల చెరువులకు సబ్‌ లీజ్‌కు చెల్లించటమే కాక చెరువుల్లో చేప పిల్లలు వేసి, వాటిని పెంచడానికి కరుణాకర్‌  రూ.20 లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేశాడు. ఈక్రమంలో చేపలు పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల వద్దకు వెళ్లి కాళ్లా వేళ్లా పడి బతిమలాడారు. దీంతో వారు కులంపేరుతో దూషించారే కానీ కనికరించలేదు. మనస్తాపానికి గురైన కరుణాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - 2022-08-27T20:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising