ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మ సామాజికవర్గం జోలికొస్తే సహించం

ABN, First Publish Date - 2022-10-17T10:19:18+05:30

వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో రాణిస్తూ లక్షలాదిమంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కమ్మ సామాజికవర్గంపై రాజకీయ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల భారత కమ్మ సంఘాల హెచ్చరిక


సర్పవరం జంక్షన్‌(కాకినాడ), అక్టోబరు 16: వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో రాణిస్తూ లక్షలాదిమంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న కమ్మ సామాజికవర్గంపై రాజకీయ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేదిలేదని అఖిల భారత కమ్మ సామాజికవర్గం వేదిక హెచ్చరిక చేసింది. కాకినాడలో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, ఒడిసా, తెలంగాణ, కర్ణాటక, ఖమ్మం సంఘాల అధ్యక్షులు పర్వతనేని పట్టాభిరామ్‌, బొడ్డు రవికుమార్‌, వల్లూరి వెంకట్రావు, తాళ్లూరు జీవన్‌కుమార్‌ మాట్లాడారు. తమ సంఘానికి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టంచేశారు. కమ్మ సామాజిక వర్గమంటే కుల సంఘం కాదని.. ఏపీ, తెలంగాణలో ఉన్న కోటి మంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మరో కోటిమందిని ఒకే వేదికపై తీసుకొచ్చి అఖిల భారత కమ్మ మహాజన సంఘాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిం చారు. అమరావతి రాజధానికే తమ మద్దతు అని... ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు తిరిగి పెట్టాలని కోరారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సామాజికవర్గాన్ని ఎత్తిచూపితే ఎంతమాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు.

Updated Date - 2022-10-17T10:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising