డిసెంబరులోగా జీరో బ్రేక్‌డౌన్ సర్వీసులు
ABN, First Publish Date - 2022-10-08T04:24:06+05:30
ఆర్టీసీలో డిసెంబరులోగా జీరో బ్రేక్‌డౌన్ సర్వీసుల సాధన కు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ చిత్తూరు, అన్నమయ్య రీజియన్ డిప్యూటీ సీఎంఈ ఇబ్ర హీం తెలిపారు.
డీసీఎంఈ ఇబ్రహీం
మదనపల్లె అర్బన్, అక్టోబరు7: ఆర్టీసీలో డిసెంబరులోగా జీరో బ్రేక్‌డౌన్ సర్వీసుల సాధన కు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ చిత్తూరు, అన్నమయ్య రీజియన్ డిప్యూటీ సీఎంఈ ఇబ్ర హీం తెలిపారు. శుక్రవారం మదనపల్లెలోని రెం డు డిపోలను పరిశీలించారు. అనంతరం గ్యారేజ్ లో ఆర్టీసీ సిబ్బందితో గేట్‌మీటింగ్ నిర్వహిం చారు. మెకానిక్ సూపర్‌వైజర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మదనపల్లె వన్‌డిపో పరిథిలో ఏడు బస్సులకు టాప్ ఓవరాల్ చేయాలని ఆదేశిం చారు. ఒక బస్సుకు ఇంజన్ మార్పించారు. అ న్ని సర్వీసులకు డిసెంబరులోగా ఫేస్‌లిఫ్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. సూపర్‌లగ్జరీ సర్వీసుల్లో సీట్టు మార్చడంతోపాటు, ప్రతి సీట్ వద్ద సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశా మన్నారు. అన్ని బస్సులకు అప్లయ్, సప్లయ్ వారి ద్వారా పెయింట్స్ వేయించామన్నారు. డ్రైవ ర్లకు డ్రైవింగ్‌లో మెళకువలు తెలియజేసి, ప్రయా ణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాల ని సూచించారు. ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. పంచసూత్రాల ను ఉసయోగించి బస్సును ప్రమాదరహితంగా నడిపి కేఎంపీఎల్ సాధించాలన్నారు. ఈ నెలలో 5.45 కేఎంపీఎల్ సాధించిన మదనపల్లె వన్ డిపో మేనేజర్‌ను. సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వన్ డిపో మేనే జరు మూరే వెంకటరమణారెడ్డి అసిస్టెంట్ మేనే జరు రేవతి, మెకానిక్ సూపర్‌వైజర్లు, సిబ్బం ది పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:24:06+05:30 IST