ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక సేవలో యువత ముందుండాలి

ABN, First Publish Date - 2022-09-25T05:13:10+05:30

సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని బీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

బి.కొత్తకోటలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 24: సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని బీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ ఎస్‌ఎస్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా పాల్గొన్న సుధాకర్‌రెడ్డి, ఏఎంవీఐ శివలింగయ్య, మానసిక వైద్యు రాలు రాధిక మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా మనిషికి ఆనం దం కలుగుతుందని, తద్వారా జీవనశైలిలో మార్పు వస్తుందన్నారు. స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కోమటివానిచెరువు కట్టపై మొలచిన పిచ్చి మొక్కలను తొలగించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కాలుష్య నివారణపై ప్రజల కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ ఆర్‌ గురుప్ర సాద్‌, ప్రిన్సిపాల్‌ ఎస్‌ రమాదేవి,  వైస్‌ ప్రిన్సిపాళ్లు శ్రీనివాసులు, వెంకట శివారెడ్డి, మోహనవల్లి, సుబ్బరాయుడు, రెడ్డెప్ప, కృష్ణవేణి, మాధవి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో: పీలేరులోని సంజయ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని వారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ యూనిట్‌ అధికారి పవన్‌ విద్యార్థు లకు క్షయ వ్యాధి లక్షణాలు, వాటి నివారణ గురించి వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారిణి సంధ్య విద్యా ర్థులతో ఎన్‌ ఎస్‌ఎస్‌ ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రబాబు, శివరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీడీ భరణినాథరెడ్డి పాల్గొన్నారు. 

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ బాలకృష్ణమూర్తి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో శనివారం ఎన్‌ఎస్‌ఎస్‌డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట్రాముడు, సుప్రజావాణి, సురేష్‌బాబు, వెంకట్రమణ, వసుంధర, విద్యార్థులు పాల్గొన్నారు. 

బి.కొత్తకోటలో:  ఎన్‌.ఎస్‌.ఎస్‌ డేను స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ శేషాద్రిబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ అధికారి చిన్న వెంకటేష్‌లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవలోనూ పాల్గొనాలని కోరారు.  కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక మధురై మీనాక్షి డిగ్రి కళాశాలలోఎన్‌ఎస్‌ఎస్‌ డే సందర్బంగా శనివారం కొత్త యూనిట్‌ను ప్రారంబించారు.  కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ ఎంఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రిన్స్‌పాల్‌ రామ్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డీనేటర్లు శివరామయ్య, మాదవరెడ్డి, బి.కొత్తకోట ఆర్‌ఐ బాలాజీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-25T05:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising