ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశభక్తిని నింపేందుకే యువ సంఘర్షణ యాత్ర!

ABN, First Publish Date - 2022-08-05T04:53:34+05:30

ఆజాదీ కా అమృ తోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపడమే యువ సంఘర్షణ యాత్ర లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.

రాజంపేట: యువ సంఘర్షణ మోటారు సైకిల్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, ఆగస్టు 4: ఆజాదీ కా అమృ తోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపడమే యువ సంఘర్షణ యాత్ర లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ప్రారంభించిన బీజేపీ యువమోర్చా యువ సం ఘర్షణ యాత్ర గురువారం రాయచోటికి చేరింది. ఈ సందర్భంగా బీజేపీ రాయచోటి పట్టణ అధ్య క్షుడు నిర్మల్‌కుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీలోని శివాలయం, నేతాజీ సర్కిల్‌, ఠానా మీదుగా రాజంపేట బయలుదేరి వెళ్లారు. నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి  ఉద్యమానికి నాంది పలికే ప్రయత్న మే ఈ యువ సంఘర్షణ  యాత్ర మరో ఉద్దేశ మన్నారు. ఈ నెల 2న తిరుపతిలో మొదలైన ఈ బైక్‌ ర్యాలీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ 12న కర్నూల్‌లో భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శివగంగిరెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస కుమార్‌ రాజు, బండి ఆనంద్‌, చీర్ల శ్రీనివాస యాదవ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

రాజంపేట: రాజంపేట జూనియర్‌ కళాశాల నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీ జేపీ కిసాన్‌ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురే ష్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు, రాజం పేట ఇన్‌చార్జి పోతుగుంట రమేష్‌నాయుడు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌, జిల్లా అ ధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్య దర్శి రాజేష్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడు తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.




Updated Date - 2022-08-05T04:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising