ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారస్తులపై వైసీపీ వీరబాదుడు

ABN, First Publish Date - 2022-12-07T00:08:13+05:30

సొంతకాళ్లపై నిలబడి వ్యాపారాలు సాగిస్తున్న వారిపై వైసీపీ ప్రభుత్వం వీరబాదుడుకు పాల్పడుతోందని, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ వ్యాపారులు వాపోతున్నారని, వీరికి టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాపారులకు అండగా టీడీపీ : కడప ఇన్‌చార్జి అమీర్‌బాబు

కడప, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సొంతకాళ్లపై నిలబడి వ్యాపారాలు సాగిస్తున్న వారిపై వైసీపీ ప్రభుత్వం వీరబాదుడుకు పాల్పడుతోందని, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ వ్యాపారులు వాపోతున్నారని, వీరికి టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కడప నగరంలోని వైవీ సీ్ట్రట్‌, బీకెఎం వీధి, మండిబజార్‌, శ్రీరాములబజార్‌, అమ్మవారిశాలవీది, మంజుమీయ పాత మున్పిపల్‌ మార్కెట్‌ల్లో టీడీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో, వ్యాపారులతో మాట్లాడారు. జగన్‌పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ది, ప్రజల సంక్షేమం సాధ్యమని చెప్పుకొచ్చారు. వ్యాపారుల ఆర్థికాబివృద్దికి దోహదపడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, తెలుగురైతు నాయకులు లక్ష్మిరెడ్డి, టీడీపీ వాణిజ్యవిభాగం పార్లమెంట్‌ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌,శ్రేష్టి, ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జయకుమార్‌,రాష్ట్ర నాయకులు జియావుద్దీన్‌, శివ, సుబ్బరాయుడు, సుబ్బయ్య, సయ్యద్‌ మహమ్మద్‌, వార్డు ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising