ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరపతి కోసమే వైసీపీ ప్లీనరీ

ABN, First Publish Date - 2022-07-04T04:56:59+05:30

జగన్‌ ఆరాచక పాలనతో ప్రజ ల్లో పార్టీకి తరలిపోయిన పరపతిని కాపాడుకునేందుకే ‘వైసీ పీ’ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారని కడప పార్లమెం ట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఎద్దేవా చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేత మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీ కుర్చీలను చూసైనా ఆత్మపరిశీలన చేసుకోండి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జూలై 3: జగన్‌ ఆరాచక పాలనతో ప్రజ ల్లో పార్టీకి తరలిపోయిన పరపతిని కాపాడుకునేందుకే ‘వైసీ పీ’ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారని కడప పార్లమెం ట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో ప్లీనరీ ప్రారంభమైన పది నిమిషాల్లోనే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని, దీన్ని చూసైనా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోయిందనే విషయాన్ని ఆర్థం చేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇంటిపన్ను పెంపు, నీటితీరువా, చెత్తపన్ను సహా తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచి, ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడుకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం, చంద్రబాబు పర్యటనలకు స్వచ్చందంగా ప్రజలు తండోప తండాలుగా తరలిరావడం ఇవన్నీ చూసి వైసీపీలో కలవరం మొదలైందన్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్‌ గడప గడపకూ ప్రభుత్వం, సామాజిక బస్సుయాత్ర చేపట్టగా, రెండు ఆట్టర్‌ప్లాప్‌ కావడం, ప్రజాప్రతినిధులను సమస్యలపై ప్రజలు నిలదీయడంతో వైసీపీ అధిష్ఠానం డైలమాలో పడిందన్నారు. పోయిన పరపతిని కాపాడుకునేందుకే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ప్లీనరీలను నిర్వహించేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారన్నారు. సీఎం సొంతజిల్లాలోనే ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారంటే, రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆర్థం చేసుకోవచ్చు అంటూ, ఇప్పటికైనా వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిందని లింగారెడ్డి హితవు పలికారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యదర్శి సిద్దయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T04:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising