వైసీపీ నేతలవి శవరాజకీయాలు
ABN, First Publish Date - 2022-08-05T05:23:26+05:30
వైసీపీ నేతలకు శవరాజకీయాలు చేయడం అలవాటని ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని రాజంపేట పార్ల మెంటరీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి, తంబళ్ళపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు.
కురబలకోట, ఆగస్టు 4:వైసీపీ నేతలకు శవరాజకీయాలు చేయడం అలవాటని ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని రాజంపేట పార్ల మెంటరీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి, తంబళ్ళపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం మం డలంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్‌లపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అనంతరం మండలంలోని అంగళ్లులో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే నారా కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎంపీ విజయసాయిరెడ్డి, వైపీపీ సోషల్‌మీడియా కన్వీనర్ దేవేంద్రరెడ్డిలు అసత్య ప్రచారాలు చేస్తున్నా రని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ భూమిరెడ్డి, సిద్దారెడ్డి, శ్యామల, గోవర్థన్‌రెడ్డి, వైజీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
దేవేందర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
పీలేరు, ఆగస్టు 4: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై దుష్ప్ర చారం చేస్తున్న వైసీపీ సోషియల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి పై తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పీలేరు అర్బన్ సీఐ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోషియల్ మీడియా వేదికగా తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న దేవేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. టీఎన్ ఎస్ఎఫ్ పీలేరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్టీఆర్ నఫీస్ మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని ప్రజల దృష్టి నుంచి పక్కకు మళ్లించడానికే ఉమామహేశ్వరి మరణం తరువాత వైసీపీ వారు శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పఠాన్ మౌలా, మోదిన్ బాషా, బాబ్రీ, సాధిక్, అబ్దుల్లా, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
గుర్రంకొండలో:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అను చిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషియల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మండల తెలుగు యువత అధ్యక్షుడు సోమేపల్లి క్రాంతికుమార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు నాయకులతో కలిసి ఫిర్యా దు చేశారు. కార్యక్రమంలో రంజిత్, చలమారెడ్డి, జమీర్, సుబ్బరాజు, రామాంజులు పాల్గొన్నారు.
విజయసాయి విషప్రచారాలు మానుకోండి
మదనపల్లె టౌన్, ఆగస్టు 4: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విషప్రచారాలు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుద్ధి మార్చు కోవాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్, రాష్ట్ర కార్యదర్శి పర్వీన్‌తాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్‌లు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ పార్లమెంట్ కార్యా లయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆత్మ హత్య చేసుకున్న ఎన్టీఆర్ కుమార్తె ఉమమ హేశ్వరి మరణాన్ని కూడా వైసీపీ నాయ కులు విషాన్ని చిమ్ముతున్నారన్నారు. వైసీపీకి చెందిన దేవేంద్రరెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మధుబాబు, నవీన్ పాల్గొన్నారు.
ములకలచెరువలో: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీప దిగజారుడు రాజకీయాలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతి నిధి గుత్తికొండ త్యాగ రాజు ఆరోపించారు. ములకలచెరువులో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు దేవేందర్‌రెడ్డి, విజయసా యిరెడ్డిలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-08-05T05:23:26+05:30 IST