ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని కార్మికుల ఆందోళనలు

ABN, First Publish Date - 2022-05-24T05:49:24+05:30

మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కడప మున్సిపల్‌ కార్పొరేషన వద్ద ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు.

నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(సెవెనరోడ్స్‌), మే 23 : మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం కడప మున్సిపల్‌ కార్పొరేషన వద్ద ఇంజనీరింగ్‌ కార్మికులు నిరసన తెలిపారు. మున్సిపల్‌ నగర అధ్యక్షుడు సుంకర రవి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఓ నెంబర్‌ 7 ప్రకారం ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.18500 హెల్త్‌ అలవెన్సులు, పనిముట్లు ఇవ్వాలన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. మున్సిపల్‌ కా ర్మికులను పర్మినెంట్‌ చేసి ఆప్కోస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి పి.వి సుబ్బయ్య డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర, జిల్లా నాయకులు సుబ్బయ్య, విజయభాస్కర్‌, సుంకరరవి, వడ్లపల్లి, శ్రీధర్‌బాబు,  కిరణ్‌కుమార్‌ నగర పాలక సంస్థ కడప కార్పొరేషన కమిషనర్‌ రమణారెడ్డిని కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆనందరావు, టి.బ్రహ్మానందరెడ్డి, వాటర్‌ కార్మికులు చలమ్మయ్య ప్రసన్నకుమార్‌, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising