ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరాల నియంత్రణకు కృషి చేయండి: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2022-10-08T04:22:30+05:30

అన్నిశాఖల సమన్వయంతో జ్వరాల నియంత్రణకు కృషి చేయాలని డీఎంహెచ్‌వో కొండయ్య పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మదనపల్లె మున్సిపల్‌ కార్యాలయం లోని కౌన్సిల్‌ హాలులో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఫీవర్‌ సర్వేను తనిఖీ చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, అక్టోబరు 7: అన్నిశాఖల సమన్వయంతో జ్వరాల నియంత్రణకు కృషి చేయాలని డీఎంహెచ్‌వో కొండయ్య పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మదనపల్లె మున్సిపల్‌ కార్యాలయం లోని కౌన్సిల్‌ హాలులో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి ప్రాంత మండలాల్లో డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా, చికెన్‌గున్యా, విషజ్వరాలు ప్రబలి నట్లు తెలిపారు. అపరిశుభ్రత, దోమకాటు కారణంగానే జబ్బులు వస్తున్నట్లు స్పష్టం చేశారు.  కలుషిత తాగునీటి కారణంగా జ్వరాల తీవ్రత పెరిగిందన్నారు.  జ్వర పీడి తులు నిర్లక్ష్యం చేయకుండా జిల్లా ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్ష చేయించుకో వాలన్నారు. ఫీవర్‌ సర్వేతో వ్యాధులు తగ్గుముఖం పడతాయన్నారు. సర్వే వేగవంతం చేసి వ్యాధుల వ్యాప్తిని తగ్గించాలని సూచించారు.  జ్వరాల తీ వ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు. వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలని ఆదేశిం చారు.  దోమల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ శానిటరీ సిబ్బందికి సూచించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ మాట్లాడుతూ పట్టణంలో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జ్వరాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్యసిబ్బందికి సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో లక్ష్మి మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల నియంత్రణే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. 


Updated Date - 2022-10-08T04:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising