ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలంతా పనిచేసి చేతినుంచి డబ్బులు కట్టాలా..

ABN, First Publish Date - 2022-01-28T05:00:56+05:30

నెలంతా పనిచేసి తామే చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిం దని మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌ నిర్వాహకు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం

తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న ఎండీయూ నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండీయూ నిర్వాహకుల ఆవేదన

ఎర్రగుంట్ల, జనవరి 27: నెలంతా పనిచేసి తామే చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిం దని మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ యూనిట్‌ నిర్వాహకు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మం డలంలోని ఎండీయూ నిర్వాహకుల సంఘం ఆధ్వ ర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటంటికి రేషన్‌ పంపిణీ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలున్నాయని అనేక సార్లు తెలిపామని, వాటిని పరిష్కరించలేదన్నారు. మొబైల్‌ రైస్‌ డిస్ర్టిబ్యూషన్‌ వాహనా లకు సంబంధించిన ఇన్సురెన్స్‌ మొత్తాన్ని సుమారు రూ. 11,125 మొదటి సంవత్సరం ప్రభుత్వమే కట్టిందని, మిగిలిన అయిదు సంవత్సరాల కాలానికి సివిల్‌ సప్లైస్‌ డిపార్ట్‌మెంటు చెల్లిస్తుందని అగ్రిమెంటులో తెలపార న్నారు. కానీ ఇప్పుడు ఇన్సురెన్స్‌తో అధికారులకు సంబంధం లేదంటున్నారని వాపో యారు. దీంతో తమ బ్యాంకు ఖాతా నుంచి రెండో సంవత్స రం ఇన్సురెన్స్‌ మొత్తం కట్‌ చేస్తున్నట్లు సమాచారం పంపార ని, జనవరి నెలకు సంబంధించిన బాడుగ నుంచి వచ్చే రూ.18000లలో చేతికి కేవలం 7885మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనానికి తామే ఇన్సురెన్స్‌ చెల్లిం చి జగన్‌ బొమ్మ తీసివేసి బయట బాడుగలకు తిప్పుకుం టామని అడిగామని, అధికారులు ఇందుకు ఒప్పు కోవడం లేదన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉంచాల్సిందే నని ఆదేశిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో హరీష్‌, విష్ణు వర్ధన్‌రెడ్డి, వెంకటేష్‌, కరీం, హుస్సేన్‌, కిషోర్‌బాబు, మహీర్‌ బాషా, అంట్రోస్‌, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising