ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలగాలి

ABN, First Publish Date - 2022-03-17T05:04:54+05:30

మహిళలు తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగే స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సాధికారత సంస్థ సివిల్‌ జడ్జి కవిత పేర్కొన్నారు. కడప

సమావేశంలో మాట్లాడుతున్న సివిల్‌ జడ్జి కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎడ్యుకేషన్‌), మార్చి 16: మహిళలు తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగే స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సాధికారత సంస్థ సివిల్‌  జడ్జి కవిత పేర్కొన్నారు. కడప నగరం ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ సేవా సమితి, ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో మహిళా న్యాయ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్తిపరంగా గానీ, శీలపరంగా గానీ అన్యాయం జరిగినప్పుడు వెంటనే కోర్టును ఆశ్రయిస్తే తగిన న్యాయం జరుగుతుందన్నారు. న్యాయ సహాయం కోసం మహిళలు తమ హక్కులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో విద్యార్థినులకు వివరించారు. మహిళలను శారీరకంగా గానీ, మానసికంగా గానీ హింసించినట్లయితే కోర్టును ఆశ్రయిస్తే తగిన శిక్ష పడుతుందని అడ్వకేట్‌ శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిస్సిపాల్‌ సుబ్బలక్ష్మమ్మ, ఎన్‌ఎ్‌సఎ్‌సపీవో డాక్టర్‌ జి.విజయలక్ష్మిదేవి, వుమెన్‌ ఎంపవర్మెంట్‌ కన్వీనర్‌ యుగవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-17T05:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising