ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప జిల్లా పేరు మార్చే హక్కు ఎవరిచ్చారు

ABN, First Publish Date - 2022-10-01T05:28:15+05:30

కడప అంటే దేవుని కడప అని, కడప పేరు తీసి వైయ్‌సఆర్‌ జిల్లా అని పేరు పెట్టే హక్కు ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరిచ్చారని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యమంత్రిని ప్రశ్నించిన ఆదినారాయణరెడ్డి

ముద్దనూరు సెప్టెంబరు 30: కడప అంటే దేవుని కడప అని, కడప పేరు తీసి వైయ్‌సఆర్‌ జిల్లా అని పేరు పెట్టే హక్కు ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరిచ్చారని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.  స్థానిక పాత బస్టాండు ఆవరణలో ప్రజాపోరులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు రాలేదని ధర్నా చేసినా... నిరుద్యోగులు ఉద్యోగం రాలేదని చనిపోతున్నా, రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా ముఖ్యమంత్రికి పట్టదని.. ఆయన కనికరం లేని కనకరాజు అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన పథకం కింద ఇళ్లు ఇస్తే జగనన్న కాలనీగా పేరు పెట్టుకున్నాడన్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం చుట్టూ సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నా... మనకు ధర ఎక్కువ అని.. మనకు దగ్గరలో ఉన్న కదిరి, నొస్సం ఇతర ప్రాంతాల్లో మాత్రం ధర తక్కువగా ఉందన్నారు. భూములు ఇచ్చిన మనకు చేసే న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. తాను మంచి పార్టీలో చేరానని.. వందశాతం జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్లలో రైళ్లు ఆపేందకు మాట్లాడతామన్నారు. కార్యక్రమంలో దేవగుడి రాజేశ్వరరెడ్డి, మండల బీజేపీ నాయకులు గుణంత్‌రెడ్డి, మధుసూదనరెడ్డి, కమలాకర్‌రెడ్డి, గోపాలక్రిష్ణయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising