ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములకు మెరుగైన పరిహారం అందిస్తాం

ABN, First Publish Date - 2022-08-13T05:14:29+05:30

పీబీసీ కింద భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్‌ రోహిణి పేర్కొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న డిప్యూటీ కలెక్టర్‌ రోహిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, ఆగస్టు 12: పీబీసీ కింద భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్‌ రోహిణి పేర్కొన్నారు. వేంపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, పీబీసీ డీఈ నాగమణి, ఏఈ ఇతర అధికారులతో కలిసి శుక్రవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో 21 మంది రైతులు 4.40ఎకరాల భూమిని కోల్పోతున్నారు.

ఎకరాకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని రైతులు కోరగా పలుమార్లు చర్చించి రూ.7.50లక్షలు ఇస్తామని ఆమె తెలియజేశారు. చివరికు రూ.9లక్షలైనా ఇవ్వాలని రైతులు గట్టిగా పట్టుబట్టారు. జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మాజీ గ్రంథాలయ చైర్మన్‌ బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising