ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2022-09-20T04:58:44+05:30

స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసే ప్రతి ఫిర్యాదు దారుడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు.

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పందనలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు


రాయచోటి టౌన్‌, సెప్టెంబరు 19: స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసే ప్రతి ఫిర్యాదు దారుడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 74 మంది ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించారు. అలాగే పిటీషనర్ల బాధలు, సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసుస్టేషన్ల పరిధిలోని అధికారులతో ఎస్పీ ఫోన్‌ చేసి మాట్లాడి అందిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే స్పందన ఫిర్యాదులపై వారు తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు బదలాయించి చట్ట పరిధిలో విచారణ జరిపి సత్వరం ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Updated Date - 2022-09-20T04:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising