ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకొద్దీ ఓటు హక్కు..!

ABN, First Publish Date - 2022-12-15T23:36:48+05:30

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వంపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత లేనట్లు చూపించాలన్నది కొందరి ప్లాన్‌. అందుకు తగ్గట్లుగానే ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తి అడ్డదారుల్లో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి నిబంధనలకు విరుద్దంగా ఓటు హక్కు నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 2500 దాకా బోగస్‌ ఓట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రివర్స్‌ అయిన బోగస్‌ ఓటర్లు

రేషన్‌ కార్డు, పింఛను పోతుందని భయం

లేని సిబ్బందిని చూపించిన పాఠశాలల యాజమాన్యాలు సైతం వెనకడుగు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. బోగస్‌ ఓట్లు నమోదు చేయించుకుని వైసీపీ అభ్యర్థిగా గెలిచేందుకు వ్యూహాలు రూపొందించారు. కొందరు అధికారులు కూడా వీరికి సహకరించారు. ఈ వ్యవహారంపై కలెక్టరు, రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు బోగస్‌ ఓటరురాయుళ్లలోనే మార్పు మొదలైంది. ఓటు హక్కు నమోదు చేసుకుంటే ఎక్కడ రేషన్‌కార్డు, కుటుంబ సభ్యులకు అందే పింఛను రద్దు అవుతుందోనని భయపడి ఓటు హక్కు వదిలేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఎన్నికల అధికారులకు ఫారం-7 అందించి రద్దు చేయాలని కోరుతున్నారు. అలాగే లేని సిబ్బందిని ఉన్నట్లు చూపించి పాఠశాల యాజమాన్యాలు అఽధికార పార్టీకి సహకరించాయి. అయితే పనిచేసే సిబ్బందికి భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందనే భయంతో కొందరు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఓటు హక్కు విత్‌డ్రా చేసుకునేందుకు చూస్తుండడం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

(కడప - ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వంపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత లేనట్లు చూపించాలన్నది కొందరి ప్లాన్‌. అందుకు తగ్గట్లుగానే ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తి అడ్డదారుల్లో ప్రైవేటు విద్యాసంస్థల నుంచి నిబంధనలకు విరుద్దంగా ఓటు హక్కు నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 2500 దాకా బోగస్‌ ఓట్లు నమోదైనట్లు సమాచారం. ప్రైవేటు విద్యాసంస్థల్లో హైస్కూలు సెక్షన్‌ బోధించే వారు మాత్రమే ఓటు హక్కుకు అర్హులు. కనీసం ఆరేళ్ల పాటు ఉపాధ్యాయులు పనిచేసి ఉండాలి. వారికి పీఎఫ్‌ చెల్లించాలి. వేతనాలు బ్యాంకు నుంచే జమ అవుతుండాలి. ఇలా పలు నిబంధనలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కాలరాసి అడ్డదారుల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కడపలో ఓ పాఠశాలలో 13 మంది ఓటు హక్కుకు అర్హులైతే 75 మందిని నమోదు చేయించారు. అలాగే మరో స్కూలులో 16 మంది అర్హులైతే 25 మందిని నమోదు చేశారు. రాయచోటిలో రెండేళ్ల నుంచి మూతపడ్డ పాఠశాల లో 12 మందికి ఓటు హక్కు కల్పించారు. ఎర్రగుంట్లలోని ఓ పాఠశాలలో ఓటు హక్కుకు ఒకరు అర్హులైతే 13 మందిని నమోదు చేయించారు. ఆర్‌టీపీపీలో 16 మందికి గాను 33 మంది, పులివెందులలోని ఓ స్కూలులో 13 మందికి గాను 25 మందిని చేర్పించినట్లు ఆరోపణలున్నయి. వీరితో పాటు బద్వేలు, ఎర్రగుంట్ల, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు... ఇలా చాలా చోట్ల అర్హులకన్నా అనర్హులనే ఎక్కువగా చేర్పించారు.

రేషన్‌కార్డు రద్దవుతుందనే భయం

ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను వీలైనంత మేర తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. రకరకాల మార్గాల్లో వడబోత పెట్టింది. అవుట్‌సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులకు తెల్లరేషన్‌ కార్డుల్లో కోత విధించింది. ఇప్పుడు తమకు ఓటు హక్కు నమోదైతే పీఎఫ్‌, ఇతర వాటిని గుర్తించి ఎక్కడ రేషన్‌కార్డు రద్దువుతుందో అని కొందరు భయపడుతున్నారు. రేషన్‌కార్డు రద్దయితే ఆ కుటుంబానికి వచ్చే పింఛన్‌, ఇతర పథకాలు రద్దవుతాయి. ఎవరినో గద్దెనెక్కించేందుకు తామెందుకు ఇబ్బంది పడాలంటూ కొందరు బోగ్‌సగా ఓట్లు నమోదు చేయించుకున్నవారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీరు ఓటు తొలగింపు కోసం ఫారం-7 పత్రాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

‘తక్కువ సిబ్బంది ఉంటే ఎక్కువ మంది ఉన్నట్లు చూపి ఓట్లు నమోదు చేయించాం. వాస్తవ సిబ్బందికి, బోగస్‌ సిబ్బందికి మధ్య తేడా ఉంది. పాఠశాల నిర్వహణ ఇతరత్రా వాటికి సంబంధించి అధికారికంగా ఏదైనా తేడా వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు అంత రిస్క్‌’ అని కొందరు ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు కూడా వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. పీఎఫ్‌ ఇతరత్రా వాటికి చెల్లించినట్లు చూపిస్తే ఆ ఉపాధ్యాయులకు హక్కు కల్పించినట్లవుతుందని, ఎందుకు లేనిపోని రిస్క్‌ తీసుకోవాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి.. మొత్తానికైతే ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-12-15T23:36:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising