ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దస్తగిరి వాంగ్మూలంలో ఎవరి పేర్లు బయటపడతాయోనని వైసీపీలో ఆందోళన

ABN, First Publish Date - 2022-02-17T16:27:32+05:30

కడప: వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగం పెంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగం పెంచారు. పులివెందుల కోర్టులో మరోసారి దస్తగిరితో వాంగ్మూలం ఇప్పించనుంది. దస్తగిరి వాంగ్మూలంలో ఎవరి పేర్లు వస్తాయోనని వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. దీంతో అనుమానితులు అయోమయంలో పడ్డారు.


ఈ కేసులో నాలుగో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని హైకోర్టు ఆమోదించింది. దీనిపై గతంలో కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి, జి.ఉమాశంకర్‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రిజర్వు చేసిన తీర్పును న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం వెలువరించారు. వివేకాను ఎవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారనే విషయాన్ని దస్తగిరి ఇప్పటికే ప్రొద్దుటూరులో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో ఆయన అప్రూవర్‌గా మారేందుకు హైకోర్టు అంగీకరించడంతో అసలు దోషులకు శిక్ష పడటం ఖాయమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-02-17T16:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising