ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-08-20T05:16:58+05:30

ట్రాఫిక్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న స్పీకర్‌ బాక్స్‌లు, సైలెన్సర్లతో డీఎస్పీ శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన, ఆగస్టు 19:  ట్రాఫిక్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ హెచ్చరించారు. శుక్రవారం  స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషనలో ఆ యన మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామ న్నారు. సమస్య పరిష్కారం కోసం అర్బన సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అవసరమైన చర్యలు చేపడు తున్నారన్నారు. పట్టణంలో ప్రస్తుతం  లక్షకు పె ౖగా జనాభా ఉందన్నారు. గతంలో 50 నుంచి 60 ఆటోలు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 7 వేలకు పైగా ఉందని,  18 వేల ద్విచక్రవాహ నాలు, 300కుపైగా లారీలు, 120కిపైగా స్కూల్‌ బస్సులు  ఉన్నాయనారు.  జనాభా, వాహనాలు పెరిగినా రోడ్లు మాత్రం ఎప్పటిలాగే ఉన్నాయని, ఫలితంగా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంద న్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే సౌండ్‌ పొల్యూషన నివారణకు ఆటోల్లో ఏర్పాటు చేసిన స్పీకర్లతో పాటు, మల్టీ టోలన హారన్లను తొలగించి ఆయా వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు.  ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ రించారు.  ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ప్రఽ దాన కూడళ్లలో సిగ్నల్స్‌తోపాటు, ఫ్రీ లెఫ్ట్‌ ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. వాహనదారులు రాంగ్‌  రూట్లో వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగితే కనీ సం ఇన్సూరెన్స కూడా రాదన్నారు. కొంత మంది సెల్‌ఫోన మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తుం టారని, అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకా శం ఉందన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై క మ్యూని కేషన కోసం ట్రాఫిక్‌ పోలీసులకు వైర్‌లెస్‌ సెట్లు సమకూర్చామన్నారు.  రోడ్డు ప్రమాదాలపై అవ గాహన కల్పించేందుకు పట్టణంలోని పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. వాహన దారులు ట్రాఫిక్‌ నిబంధన లకు లోబడి నడుచు కోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-08-20T05:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising