ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా వినాయక చవితి వేడుకలు

ABN, First Publish Date - 2022-09-02T05:20:09+05:30

వినాయక చవితి వేడుకు లను ప్రజలు బుధవారం అంగరంగ వైభవంగా జరుపుకు న్నారు.

మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని వినాయకుడికి పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు 1: వినాయక చవితి వేడుకు లను ప్రజలు బుధవారం అంగరంగ వైభవంగా జరుపుకు న్నారు. పట్ణంలోని ఎస్బీఐ కాలనీలో ఏర్పాటు చేసిన వినా యకుడికి  మాజీ ఎమ్మెల్యే దేశాయితిప్పా రెడ్డి దంపతులు పూజలు చేశారు. ఆర్యవైశ్యహాస్టల్‌లో ఆర్యవైశ్యసంఘం, ఆర్యవైశ్యల ఆధ్వర్యంలో  నెమలివాహనంపై వినాయకుడు ఊరేగుతున్నట్లు, తెలుగు సాంప్రదాయ పండుగలను గుర్తు చేస్తూ  విగ్రహాలను ఏర్పాటు చేశారు. అనంతరం వినాయ క పూజలో ఆర్యవైశ్య సంఘం మదనపల్లె అధ్యక్షుడు ఓంప్ర కాష్‌, సెక్రటరీ సూరేగిరిధర్‌, ఉపాధ్యక్షుడు దేవతా సతీష్‌ , యల్లంపల్లె ప్రశాంత్‌  పాల్గొని పూజలు చేశారు. బర్మావీధి లోని సాయిబాబా ఆలయంలో నెమలివాహనంపై  రెడ్డెప్ప నాయుడు కాలనీలో  రాజసిం హాసనంపై వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరణ చేయించారు. రాష్ట్ర తెలుగు యువ త అధ్యక్షుడు శ్రీరాంచినబాబుతోపాటు ఆలయకమిటీ సభ్యు లు నీరుగట్టువారిపల్లెలో చౌడేశ్వదేవినగర్‌, రాజానగర్‌ ల్లో వినాయకుడిని ప్రత్యేకపూజలు చేశారు. మేదరవీధిలో  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజ పాల్గొని గణనాథుడికి ప్రత్యే క పూజలు చేశారు. అనపగ్టులోని శ్రీకృష్ణాలయంలో  ఆల యకమిటీసభ్యులు స్వామివారికి పూజలు చేశారు. బీకే పల్లెలో కనకదాస్‌నగర్‌లోని వినాయకస్వామి ఆలయంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు గంగయ్యగౌడ్‌ చీక లబైలులో టీడీపీ నేత జయరామనాయుడు, సర్పంచ్‌ ప్రభా కర్‌ పాల్గొని పూజలు చేశారు. రెడ్డీస్‌ కాలనీలో యువత ఆనంద్‌, సాయి, కౌస్సిక్‌, శివ, పండు, హేమంత్‌, వికాష్‌, జితేంద్ర, కుట్టి,రాజా, సుజిత్‌   పూజలు నిర్వహించారు.

మదనపల్లె టౌన్‌లో: పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన వినాయకుడి విగ్రహాలు ప్రజలను ఆకట్టుకు న్నాయి. స్థానిక కమ్మవీధి చౌక్‌లో 60 ఏళ్లుగా అనవా యితీ గా వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కమ్మవీధి యూత్‌ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఎన్‌.విజయ భాస్కర్‌చౌదరి ప్రారంభించారు.  కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు బోయపాటి రాణా, నాగ రాజు, ప్రవీణ్‌, లక్ష్మీకాంత్‌,  వెంకటేశ్‌ పాల్గొన్నారు.

పీలేరులో: పీలేరు మండల ప్రజలు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.  మూడేళ్ల విరా  మం తరువాత సామూహిక ఉత్సవాలకు అనుమతులు దొరకడంతో పట్టణంలో 70 కేంద్రాల్లో వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించి  స్వామి వారికి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిం చారు. గణేశ్‌ ఉత్సవ కమిటీ గణేశ్‌ లడ్డూను స్థానిక యల్ల మంద క్రాస్‌లోని పంచ ముఖ వినాయక స్వామి సెంటర్‌ నిర్వాహకులు రూ.57,500లు దక్కించు కున్నారు. దాదాపు 35 కిలోల లడ్డూను ఉత్సవ కమిటీ సభ్యులు వారికి అప్ప గించారు. ఉత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఆయా కేం ద్రాల నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. అయ్యప రెడ్డి కాలనీలో ప్రతిష్ఠించిన విగ్రహం అందరినీ ఆకట్టుకుం ది.   కార్యక్రమాల్లో మునిబాబు, వెంక టేశ్‌, నరేశ్‌, పవన్‌ కళ్యాణ్‌, రెడ్డిఅభిషేక్‌, రెడ్డిగిరీశ్‌ పాల్గొన్నారు. 

గుర్రంకొండలో: వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా వాడవాడ లా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలం కరించి పూజలను నిర్వహించారు. అంతేకా కుండా మహిళ లు నాగరాళ్లకు పూజలను చేసి మొక్కులు తీర్చుకొన్నారు.

ములకలచెరువులో: మండలంలో బుధవారం వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ములకల చెరువులో వినాయకనగర్‌, పీటీఎం రోడ్డు, నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశా రు. వినాయకుడి మండపాల వద్ద సందడి నెలకొంది. 

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపు కున్నారు. పెద్దమండ్యం, కలిచెర్ల, పాపేపల్లి, శివపురం, ముసలికుంట, మందలవారిపల్లి, సి.గొల్లపల్లి, బండ్రేవు, సిద్దవరం, వెలిగల్లు, బండమీదపల్లి, కోటకాడపల్లి, గుర్రం వాండ్లపల్లి, అవికేనాయక్‌ తండా, రామానాయక్‌ తండా, దిగువపల్లి గ్రామాలలో గణనాథులను ఏర్పాటు చేసి మండలపాల వద్ద ఆకర్షణీయంగా విద్యుత్తు దీపాలంకరణ చేసి పూజలు చేశారు.       

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా బుధ వారం వినాయ కచవితి వేడుకలను  వైభవంగా జరుపుకు న్నారు. పట్టణంలోని తోటవీధి, కొత్తపేటవీధి, రామాలయం రోడ్డు, ఎన్‌టీఆర్‌ కాలనీ, జెట్టిపాలెం వీధి, గాంధీపేట, బజా రువీధి, పింగాణి ఫ్యాక్టరి, ఇందిరమ్మ కాలనీ తదితర  ప్రాం తాలలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వేడుక లలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాల వద్ద భక్తులకు  అన్న, ప్రసాద వితరణ చేశారు. 

నిమ్మనపల్లెలో: మండలంలోని గ్రామాలలో బుధవారం వినాయకచవితి పండుగ సందర్బంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు విగ్ర హాల వద్ద కోలాహలం నెలకొంది. నిమ్మ నపల్లెలో కందూ రు రోడ్డు, దిగువవీది తదితర ప్రాంతాలలో 10అడుగుల  విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపు కుంటున్నారు. పలు గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో విభిన్న రూపాల గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. పండు గ రోజున ఇళ్లలో బుజ్జి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పండుగ రోజు సాయంత్రం అనంతపురం జిల్లా లేపాక్షికి చెందిన రామ్మూ ర్తి కళా బృందం సభ్యులచే ప్రదదర్శించిన తోలుబొమ్మలాట (రామాయంణంలో సుందరకాండ పర్వం) ప్రజలను అల రించింది.  

బి.కొత్తకోటలో: మండలంలో వినాయకచవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. బి.కొత్తకోట నగర పంచాయతీ లోని అన్ని వీధుల్లోనూ వినా యకుని మండపాల్లో అతిపెద్ద వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యే క పూజలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో వివిధ రూపాల్లో  ఏర్పా టు చేసిన వినాయక విగ్రహాలకు ఆయా ప్రాంతాల్లో ప్రజ లు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. 

కురబలకోటలో: కురబలకోట మండలంలో వాడవాడలా వినాయకచవితి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని అంగళ్ళు, కురబలకోట, ముది వేడు, మట్లివారిపల్లె తదితర గ్రామాల్లో వినాయకుడి ప్రతి మలను ప్రతిష్ట్ఠిచి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

పెద్దతిప్పసముద్రంలో : మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వ హించారు. స్థానిక పీటీఎంతో పాటు రంగసముద్రం, రాపూ రిపల్లె, మడుమూరు, కందుకూరు, పులికల్లు, మద్దయ్యగా రిపల్లె, అంకిరెడ్డిపల్లె, మల్లెల, టి.సదుం, విసనకర్రవాండ్లపల్లె లయందు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు.  

కలకడలో:వినాయక చవితి పండుగను మండల ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలకడ, ఎర్రయ్య గారిపల్లె, కోన, బాటవారిపల్లెతోపాటు తదితర గ్రామాలలో వివిధ రూపాలున్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి  ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు వారి వారి ఇళ్లలో గణపయ్యలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.





Updated Date - 2022-09-02T05:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising