ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠవాసా.. గోవిందా..

ABN, First Publish Date - 2022-01-13T05:30:00+05:30

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. ఉత్తరద్వారం ద్వారా లక్మీనారాయణుని దివ్యస్వరూపాన్ని భక్తులు తిలకించారు.

దేవునికడపలో స్వామి దర్శనం కోసం భక్తుల బారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తిప్రపత్తులతో ఉత్తరద్వార దర్శనం

కిటకిటలాడిన ఆలయాలు

కడప(మారుతీనగర్‌) / ఒంటిమిట్ట / నందలూరు, జనవరి 13: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. ఉత్తరద్వారం ద్వారా లక్మీనారాయణుని దివ్యస్వరూపాన్ని భక్తులు తిలకించారు. సుందరమూర్తిని దర్శించుకున్న భక్తులు ఈ ఏడాదంతా మంచిగా ఉండాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చల్లగా చూడాలంటూ వేడుకున్నారు.

దేవునికడపలో : శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున 5 గంటలకే భక్తులు క్యూలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు. అలాగే కడప నగర రిమ్స్‌ సమీపంలోని పాలకొండరాయ స్వామివారి దేవస్థానంలో స్వామిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు.

గరుడవానంపై దర్శనమిచ్చిన సీతారామ లక్ష్మణులు

ఒంటిమిట్ట కోదండరామాలయం భక్తజనంతో కిటకిట లాడింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా రామాలయంలో టీటీడీ అర్చకులు సీతారామలక్ష్మణుల మూల విరాట్లను ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై ఉంచి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. భక్తులు భారీగా రావడంతో టీటీడీ అధికారులు దక్షిణద్వారం గుండా క్యూలు ఏర్పా టు చేసి ఆలయంలోకి అనుమతించారు. రామాలయంలో దాతల సహకారంతో పెద్దఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖులు స్వామిని దర్శించు కున్నారు.

సౌమ్యనాథస్వామి ఆలయంలో..

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరులోని సౌమ్యనాఽథస్వామి గురు వారం ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలు మూలల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా ఆలయ చైర్మన సౌమిత్రి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాఽథస్వామి ఉత్సవ మూర్తులకు లక్ష తులసి అర్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.



Updated Date - 2022-01-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising