ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బడ్జెట్‌లో ‘ఉపాధి’కి నిధులు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-05-16T05:30:00+05:30

కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప మారుతీనగర్‌, మే 16:  కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీకి రెండు లక్షల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధి హామీ పఽథకానికి గత 2022-23 సంవత్సరానికి గాను 25 వేల కోట్ల రూపాయలు కోత విధించారని ఆరోపించారు. తక్షణమే కేంద్ర బడ్జెట్‌లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా గ్రామీణ నిరుపేదలైన ఉపాధి హామీ కూలీలకు వ్యతిరేకంగా పాలక ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలు తెచ్చాయని నిప్పులు చెరిగారు. తక్షణమే వాటిని రద్దు చేయాలన్నారు. ఇదిలా ఉండగా నేటి ధరలకు అనుకూలంగా కూలీలకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలన్నారు. పట్టణ , నగర ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ పనులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఽఘం అధ్యక్షులు వెంకటేష్‌, కార్యదర్శి అన్వేష్‌, చంద్రశేఖర్‌, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising