ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైవీయూ నిధులపై శ్వేతపత్రం ఏదీ?: ఏఐవైఎఫ్‌

ABN, First Publish Date - 2022-12-02T00:03:28+05:30

వైవీయూ నేక్‌ కమిటీ వస్తున్న సందర్భంగా దాదాపు రూ.పది కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 1 : వైవీయూ నేక్‌ కమిటీ వస్తున్న సందర్భంగా దాదాపు రూ.పది కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో 60 నుంచి 70 శాతం మాత్రమే ఖర్చు చేసి మిగిలిన మొత్తం అధికారులు పంచుకున్నారని ఆరోపిస్తూ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నవంబరు 13న విలేకరుల సమావేశంలో అడిగితే ఇంత వరకు స్పందన లేదంటే అవినీతి అకమ్రాలు జరిగినట్లు అంగీకరించినట్లేనా అని ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి గంగాసురేష్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, చైతన్య పేర్కొన్నారు. గురువారం వైవీయూలో వారు మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయం నేక్‌ సందర్శన పరిశీలనకు వస్తున్న సందర్భంగా రోడ్ల విస్తరణ, సుందరీకరణ, మరమ్మతులు చేయించడం, సోలార్‌ లైట్లు, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, కుర్చీలు కొనుగోళ్లు మార్కెట్లో ఉన్న ధర కంటే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారని, ప్లీనరీ పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసి సొమ్ము చేసుకున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీటిపై రిజిసా్ట్రర్‌ స్పందించి మొత్తం ఎంత ఖర్చు చేశారు. దేనికెంత ఖర్చయిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసినా మూడు వారాలు అవుతున్నా అధికారులు స్పందించలేదన్నారు. ఈ అవినీతిలో రిజిస్త్రార్‌, అధికారులకు వాటా ఉందని ఆరోపించారు. వేమన స్థానంలో వైఎ్‌సఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం దుర్మార్గమని, వేమన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కోరారు. లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Updated Date - 2022-12-02T00:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising