ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనాలు ఢీ : ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-09-26T04:51:55+05:30

రెండు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

సంఘటనా స్థలంలో మృతి చెందిన మల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరొకరికి తీవ్ర గాయాలు 


పెద్దమండ్యం, సెప్టెంబరు 25 : రెండు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి  తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పెద్దమండ్యం మండలం వెలిగల్లు-శివపురం రహదారి రెడ్డిబావి వద్ద ఆదివారం జరిగింది. పెద్దమండ్యం పోలీసుల వివరాల మేరకు... మండలంలోని వెలిగల్లు గ్రామ పంచాయతీ పాపతాతాగారిపల్లికు చెందిన ఎన్‌.మల్‌రెడ్డి (55) అదే గ్రామానికి  కె.రామచంద్రారెడ్డి (56)తో కలసి ద్విచక్ర వాహనంలో బండమీదపల్లి గ్రామ పంచాయతీ తురకపల్లిలో ఆదివారం జరిగే వారపుసంతలో కూరగాయల కోసం బయలుదేరారు. ఇదే మండలంలోని వెలిగల్లుకు చెందిన కరుణాకర్‌రెడ్డి పొలం పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో వెలిగల్లు నుంచి శివపురం రహదారిలో బయలుదేరారు. ఈ రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా రెడ్డిబావి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎన్‌.మల్‌రెడ్డికి తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలైన రామచంద్రారెడ్డిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ కరుణాకర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వెంకటేష్‌ పరిశీలించారు. మృతుడి కొడుకు ఎన్‌.మణికంఠరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాఽధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పాపతాతాగారిపల్లిలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.

Updated Date - 2022-09-26T04:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising